ప్రపంచకప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమికి కారణాలను విశ్లేషించారు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్. భారత్-పాక్ మ్యాచ్ అనంతరం ఓ మీడియా ఛానెల్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు.
"పాకిస్థాన్‌పై టీమిండియా అన్ని విభాగాల్లో రాణించింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. గణాంకాల్లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. భారత్ ఎంత సమయోచితంగా వారిని ఓడించిందో అందరూ చూశారు."
-సచిన్ తెందుల్కర్
పాక్ బౌలర్లు ఆదిలోనే భారత ఓపెనర్లని ఔట్‌చేయడంలో విఫలమయ్యారని సచిన్ పేర్కొన్నారు. తొలుత వికెట్లు కోల్పోకుంటే భారత్ 325 పరుగులు చేస్తుందని తాను ముందే చెప్పినట్లు గుర్తుచేశారు. రోహిత్ శర్మ (140), కేఎల్ రాహుల్(57) మెరుగైన ప్రదర్శనతో తొలి వికెట్‌కు 136 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం లభించిందని, ప్రపంచకప్‌లో మన జట్టుకు పాకిస్థాన్‌పై ఇదే అత్యుత్తమమని పేర్కొన్నారు. మంచి ఓపెనింగ్ లభిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌కు భారీ స్కోరు సాధించేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. రాహుల్ ఔటయ్యాక కోహ్లీ భాగస్వామ్యం, పాండ్య దూకుడు కలిసి వచ్చాయని లిటిల్ మాస్టర్ వివరించారు.
తొలి ఇన్నింగ్స్ ఆఖర్లో వర్షం రావడం కారణంగా.. లయ తప్పి టీమిండియా పరుగులు చేయలేకపోయిందని తెలిపారు. వర్షం రాకుంటే మరో 15 పరుగులు అదనంగా వచ్చేవని వెల్లడించారు. జూన్ 30న ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగే మరో కీలక మ్యాచ్ కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. ప్రస్తుత టీమిండియా మంచి ఫామ్‌లో ఉందని, ఇలాగే ఆడి టైటిల్ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: నేనేమీ పాకిస్థాన్ కోచ్‌ను కాదు: రోహిత్