ETV Bharat / sports

44 ఏళ్లలో రాని కప్పు 4 ఏళ్లలో.. కారణాలివే! - ప్రపంచకప్​ విజేతగా ఇంగ్లాండ్

44 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇంతకుముందు మూడు సార్లు (1979, 87, 92) ఫైనల్​ చేరిన ఇంగ్లాండ్.. కప్పు అందుకోలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం తన కలను నిజం చేస్తూ తొలిసారి కప్పును ముద్దాడింది. 2019 మెగాటోర్నీ విజతేగా అవతరించింది.

44 ఏళ్లలో రాని కప్పు 4 ఏళ్లలో.. కారణాలివే!
author img

By

Published : Jul 15, 2019, 6:40 AM IST

2015 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ నిలవాలంటే బంగ్లాదేశ్​పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. కానీ 275 పరుగుల లక్ష్య ఛేదనలో 260 పరుగులకే ఆలౌటై మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే 2019కు వచ్చేసరికి జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కేవలం నాలుగేళ్లలో ఈ మార్పునకు కారణాలు ఏంటి? గెలిచేందుకు ఇంగ్లాండ్​కు దోహదపడిన అంశాలేంటి?

ప్రపంచకప్ పరాభవం కసిని పెంచింది...

ఇంగ్లాండ్​ జట్టులో ఐదుగురు ఆటగాళ్లకు 2015 ప్రపంచకప్​లో ఆడిన అనుభవం ఉంది. అప్పుడూ ఆ జట్టు కెప్టెన్ మోర్గానే. అయితే 4 ఏళ్ల క్రితం జరిగిన వరల్డ్​కప్ పరాభవం వారిలో కసిని పెంచింది. వరుస విజయాలతో దూసుకెళ్లేలా చేసింది. జట్టులో మార్పులు చేసి ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది యాజమాన్యం. ఆ మార్పే నాలుగేళ్లలో కప్పును అందుకునేలా చేసింది.

captain morgan with world cup trophy
ట్రోఫీని ముద్దాడుతున్న కెప్టెన్ మోర్గాన్

స్ట్రాస్ పర్యవేక్షణలో రాటుతేలింది..

మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ పర్యవేక్షణలో ఇంగ్లాండ్ రాటుతేలింది. జట్టు డైరెక్టర్​గా నియమాకం అయిన తర్వాత స్ట్రాస్​ చేసిన మొదటి పని.. జట్టు కోచ్ పీటర్ మూర్స్​, మెంటర్ కెవిన్ పీటర్సన్​ను తొలగించాడు. కొత్త కోచ్​గా ట్రెవర్​ను నియమించి.. జేసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్​, బట్లర్, స్టోక్స్​, వోక్స్​ లాంటి యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు. 44 ఏళ్ల కలను 4 ఏళ్లలో నిజం చేశాడు.

13 వన్డే సిరీస్​ల్లో 11 విజయాలు..

2017 జనవరి నుంచి మెగాటోర్నీ ముందువరకు ఇంగ్లాండ్ 13 వన్డే సిరీస్​లు ఆడగా కేవలం రెండింటిలోనే పరాజయం చెందింది. వెస్టిండీస్​ (4-0), ఆస్ట్రేలియా (5-0), టీమిండియా​ (2-1), పాకిస్థాన్ ​(4-0) లాంటి అగ్రజట్లపై స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్​ల్లో గెలిచింది.

england cricket team
ఇంగ్లాండ్​ జట్టు

విదేశాల్లోనూ సత్తాచాటింది ఇంగ్లీష్ జట్టు. కంగారూ జట్టుపై 4-1, న్యూజిలాండ్​పై 3-2, శ్రీలంకపై 3-1తో సత్తాచాటింది. ఈ సమయంలో ఇంగ్లాండ్​ 39 మ్యాచ్​ల్లో నెగ్గి 12 వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ విజయాలే వన్డేల్లో ఇంగ్లాండ్​ను అగ్రస్థానానికి వెళ్లేలా చేశాయి. ఇంగ్లాండ్ చివరగా 2017లో భారత్​లో జరిగిన వన్డే సిరీస్​లో ఓడిపోయింది.

ఈ వరల్డ్​కప్​లో పడి పడి లేచిన ఇంగ్లాండ్...

ఈ మెగాటోర్నీలో ఇంగ్లాండ్ జైత్రయాత్రను మూడు భాగాలుగా విడదీస్తే.. తొలి ఐదు మ్యాచ్​ల్లో నాలుగింటిలో గెలిచి మెరుగైన స్థితిలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్​లో నెగ్గింది. అయితే పాకిస్థాన్​ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం బంగ్లాదేశ్, విండీస్, అఫ్గానిస్థాన్​పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.

england loss against sri lanka
ప్రపంచకప్​-2019లో శ్రీలంక చేతిలో ఇంగ్లాండ్ ఓటమి

అనంతరం శ్రీలంక, ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్​ల్లో అనూహ్య ఓటములతో వెనుకబడింది. బంగ్లా, పాకిస్థాన్ పుంజుకోగా.. టీమిండియాతో మ్యాచ్​ను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్​పై నెగ్గి సెమీస్​ రేసులో నిలిచింది. అనంతరం చివరి లీగ్ మ్యాచ్​లో కివీస్​పై గెలిచి సెమీస్​ బెర్త్​ ఖరారు చేసుకుంది.

సెమీస్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది ఇంగ్లాండ్. 8 వికెట్ల తేడాతో నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠ ఫైనల్లో న్యూజిలాండ్​పై గెలిచి ఏ ఇంగ్లీష్​ జట్టు సాధించని ఘనతను సొంతం చేసుకుంది. 44 ఏళ్ల కలను సాకారం చేసుకుంది.

ఇది చదవండి: 'సూపర్'​ థ్రిల్లర్​ మ్యాచ్​లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Benghazi, Libya - 14 July 2019
1. Wide of Tibesti hotel building in Benghazi
2. Mid of poster on hotel reading: (Arabic) "Gharyan Massacre-Your blood will not go in vain"
3. Various of boy and girl scouts walking on street in front of Tibesti hotel
4. Mid of children holding Libyan flags and pro-Libyan National Army (LNA) posters
5. Various of children stepping on Turkish flag on the ground
6. SOUNDBITE (Arabic) Muftah Mohamed, protester:
"We still support the army (LNA), we call for a total boycott on Turkey, on (Fayez) al-Sarraj (GNA prime minister) and on Bashagha (GNA interior minister), on the thugs and criminals. And we are victors, and from victory to victory, we still pay the price. We do not fear anybody, we do not fear Turkey, we do not fear Bashagha, we do not fear anybody. We formed a strong army and police."
7. Mid of protesters chanting pro-LNA slogans
8. Mid of poster of Marshal Khalifa Hifter and poster of Government of National Accord (GNA) chief-of-staff (Tripoli government) with red x on it
9. Close of protester chanting pro-LNA slogans
10. SOUNDBITE (Arabic) Masoud Hussein, protester:
"The reason for our presence here is to support the army (LNA) and to reject the intervention of Turkey and Qatar in the Libyan matters. The army is the lifeline, and it must enter Tripoli, and expel the Muslim Brotherhood and the militias from Tripoli."
11. Various of protestor hitting poster of Sheikh Sadiq Al-Gharyani, GNA grand mufti, with his shoe
12. SOUNDBITE (Arabic) Ahmed Bodewisa, protester:
"We salute the army (LNA) and we are in solidarity with the army, and we say to Erdogan the dog; this is Libya, it is not your kitchens, we are the farmers' organisation of the municipality of Shahat. We say to all agents and traitors; No to the (Islamic) state, No to the rogue (Muslim) Brotherhood."
13. Mid of protestor holding banner Reading: (Arabic) "No, no to the fuel smugglers"
14. Close of protester throwing cigarette butt and stepping on it on a poster of the GNA interior minister, Fathi Bashagha
15. Mid of protestors holding Libyan flags and Marshal Hifter posters and anti-Turkey banners
16. SOUNDBITE (Arabic) Abdelhamid Al-Gatruni, civilian activist:
"I say to the Turkish people that their policy must change, and they must make a serious stand, because your interests are with Libya, because the Turkish people and the Libyan people are Muslim peoples. Erdogan's policy is wrong. It is a policy of bombing, assassinations and support for Daesh (IS). This will affect you in the future. Even in the reconstruction of Libya, we will deny Turkish companies the reconstruction of Libya, unless Erdogan changes his policy towards Libya."
17. Mid of protesters holding LNA flag and pro-LNA posters
18. Close of Libyan flag
19. Various of protesters chanting pro-LNA slogans
20. Close of poster of Hifter
21. Various of protestors holding Libyan flags and Marshal Hifter posters and anti-foreign intervention banners
STORYLINE:
Residents of Benghazi gathered Sunday to protest against Turkish support for the internationally recognised Libyan Government of National Accord (GNA).
Libya is split between the GNA in Tripoli, and the Tobruk government led by Marshal Khalifa Hifter.
Hifter is in control of eastern Libya and heads the Libyan National Army (LNA).
The anti-Turkey demonstrators, who gathered in front of the Tibesti Hotel in the centre of the city, expressed their support for the LNA, which is currently engaged in continuous operations in the Tripoli, targeting armed militias.
Civilian activist Abdelhamid Al-Gatruni said "I say to the Turkish people that their policy must change, and they must make a serious stand, because your interests are with Libya, because the Turkish people and the Libyan people are Muslim peoples.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.