సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ రాణించారు. అఫ్గాన్ స్నిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసినప్పటికీ... బంగ్లా బ్యాట్స్‌మెన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఒకే ఒక సిక్సర్ కొట్టినప్పటికీ బంగ్లా మంచి స్కోరు సాధించగలిగింది.
ఆది నుంచి...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న బంగ్లా ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఓవర్‌కు 6 పరుగుల చొప్పున వచ్చేలా చూసుకుంది. జట్టు 23 పరుగుల వద్ద లిటన్ దాస్ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ ఉల్ హసన్ (51) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తమీమ్‌తో కలిసి రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
కీలక భాగస్వామ్యం...
అనంతరం తమీమ్(36)ను నబీ బోల్తా కొట్టించి బౌల్డ్ చేశాడు. నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ (83), షకిబ్‌కు మంచి సహకారం అందించాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది.
-
Afghanistan will need 263 to win at the Hampshire Bowl.
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Mujeeb Ur Rahman took 3/39 from his 10 overs while Mushfiqur Rahim and Shakib Al Hasan both continued their good form, each scoring half-centuries. #CWC19 | #BANvAFG | #RiseOfTheTigers | #AfghanAtalan pic.twitter.com/MywvVyn4RP
">Afghanistan will need 263 to win at the Hampshire Bowl.
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
Mujeeb Ur Rahman took 3/39 from his 10 overs while Mushfiqur Rahim and Shakib Al Hasan both continued their good form, each scoring half-centuries. #CWC19 | #BANvAFG | #RiseOfTheTigers | #AfghanAtalan pic.twitter.com/MywvVyn4RPAfghanistan will need 263 to win at the Hampshire Bowl.
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
Mujeeb Ur Rahman took 3/39 from his 10 overs while Mushfiqur Rahim and Shakib Al Hasan both continued their good form, each scoring half-centuries. #CWC19 | #BANvAFG | #RiseOfTheTigers | #AfghanAtalan pic.twitter.com/MywvVyn4RP
అర్ధశతకం చేసిన షకిబ్‌ను ముజీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సౌమ్య సర్కార్ (3)ను కాసేపటికే ముజీబ్ ఔట్ చేశాడు.
-
An outstanding spell from Mujeeb Ur Rahman 👏 👏 #CWC19 | #BANvAFG pic.twitter.com/vElvEUrg2k
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">An outstanding spell from Mujeeb Ur Rahman 👏 👏 #CWC19 | #BANvAFG pic.twitter.com/vElvEUrg2k
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019An outstanding spell from Mujeeb Ur Rahman 👏 👏 #CWC19 | #BANvAFG pic.twitter.com/vElvEUrg2k
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
ముష్ఫికర్ ఒక్కడే...
ఓ పక్క వికెట్లు కాపాడుకుంటూ... మరో పక్క స్ట్రైక్ రొటేట్ చేస్తూ రహీమ్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మదుల్లా (27) ఫర్వాలేదనిపించాడు. ముష్ఫికర్ 49వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి జద్రాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. మహ్మదుల్లా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మొసాద్దిక్ (35*) చివర్లో బ్యాట్ ఝుళిపించడం వల్ల బంగ్లా మంచి స్కోరు సాధించగలిగింది.
అఫ్గాన్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రెహ్మాన్ 3, నయీబ్ 2 వికెట్లతో రాణించారు. నబీ, జద్రాన్‌కు తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
రికార్డులు...
⦁ ప్రపంచకప్ కెరీర్లో 1000 పరుగుల పూర్తి చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా షకిబ్ రికార్డులకెక్కాడు.
⦁ మొత్తంగా ఈ మార్కు అందుకున్న వారిలో 19వ ఆటగాడు షకిబ్.
⦁ ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా వార్నర్‌ను వెనక్కి నెట్టాడు షకిబ్.
- ఇదీ చూడండి: ప్రపంచకప్ కెరీర్లో షకీబ్ మరో మైలురాయి