ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్ అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి కివీస్ జోరుమీదుండగా.. అఫ్గాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. కివీస్ పేస్ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తుండగా.. అఫ్గాన్ స్పిన్ పవర్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. కంట్రీ గ్రౌండ్ వేదికగా సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
-
#AfghanAtalan is all set to face @BLACKCAPS in its third match in Taunton tomorrow. #CWC19 #AfghanAtalan #AfgvsNZ pic.twitter.com/vTson3GtfV
— Afghanistan Cricket Board (@ACBofficials) June 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#AfghanAtalan is all set to face @BLACKCAPS in its third match in Taunton tomorrow. #CWC19 #AfghanAtalan #AfgvsNZ pic.twitter.com/vTson3GtfV
— Afghanistan Cricket Board (@ACBofficials) June 7, 2019#AfghanAtalan is all set to face @BLACKCAPS in its third match in Taunton tomorrow. #CWC19 #AfghanAtalan #AfgvsNZ pic.twitter.com/vTson3GtfV
— Afghanistan Cricket Board (@ACBofficials) June 7, 2019
2015లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్ ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలన్న పట్టుదలతో ఉంది. శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అదరగొట్టింది. రెండో మ్యాచ్‌లో బంగ్లా నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డారు కివీస్ బ్యాట్స్‌మెన్. అఫ్గానిస్థాన్‌లోనూ రషీద్ ఖాన్, నబీలతో కూడిన స్పిన్ విభాగం బలంగా ఉంది. మరి వీరిని ఎంతమేర ఎదుర్కొంటారో చూడాలి.
మొదటి మ్యచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన అఫ్గానిస్థాన్.. రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై పరాజయం చెందింది. లంకతో ఆడిన మ్యాచ్‌లో స్పిన్నర్ల మాయాజాలంతో లంకేయులను కట్టడి చేసినా.. బ్యాట్స్‌మెన్ అంతగా రాణించక ఓటమిపాలైంది.
-
Congrats to @OfficialSLC for the victory !
— Afghanistan Cricket Board (@ACBofficials) June 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Unfortunately not our day ! Amazing performances by @MohammadNabi007 with the bowl and @iamnajibzadran with the bat.
We will face @BLACKCAPS in our next contest on Saturday, 8th June in Taunton.#AFGvSL #CWC19 #AfghanAtalan pic.twitter.com/2tEH7CTbu2
">Congrats to @OfficialSLC for the victory !
— Afghanistan Cricket Board (@ACBofficials) June 4, 2019
Unfortunately not our day ! Amazing performances by @MohammadNabi007 with the bowl and @iamnajibzadran with the bat.
We will face @BLACKCAPS in our next contest on Saturday, 8th June in Taunton.#AFGvSL #CWC19 #AfghanAtalan pic.twitter.com/2tEH7CTbu2Congrats to @OfficialSLC for the victory !
— Afghanistan Cricket Board (@ACBofficials) June 4, 2019
Unfortunately not our day ! Amazing performances by @MohammadNabi007 with the bowl and @iamnajibzadran with the bat.
We will face @BLACKCAPS in our next contest on Saturday, 8th June in Taunton.#AFGvSL #CWC19 #AfghanAtalan pic.twitter.com/2tEH7CTbu2
అయితే ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అఫ్గాన్‌కు ఈ మ్యాచ్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ మహ్మద్ షెహజాద్ మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.