లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. సెమీస్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 94 పరుగుల తేడాతో గెలిచింది. ఇమాముల్ హక్ సెంచరీ, బాబర్ ఆజమ్ 96 పరుగులకు తోడు.. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
-
Here's how the #CWC19 table looks after #PAKvBAN 👀 pic.twitter.com/9jQ54L5Hzi
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's how the #CWC19 table looks after #PAKvBAN 👀 pic.twitter.com/9jQ54L5Hzi
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019Here's how the #CWC19 table looks after #PAKvBAN 👀 pic.twitter.com/9jQ54L5Hzi
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ సెంచరీ చేశాడు. ఆ వెంటనే హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. బాబర్ ఆజమ్ 96 పరుగులు చేసి కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
మిగతా వారిలో ఫకర్ 13, హఫీజ్ 27, హరీశ్ సొహైల్ 6, ఇమాద్ 43, సర్ఫరాజ్ 3, వాహబ్ రియాజ్ 2, షాదాబ్ ఖాన్ 1, ఆమిర్ 8 పరుగులు చేశారు.
బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీశాడు. సైఫుద్దీన్ 3, మెహదీ హాసన్ 1 వికెట్ తీశారు.
అనంతరం 316 లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఆరంభం నుంచే తడబడింది. క్రమంగా వికెట్లు కోల్పోయింది. షకీబ్ ఒక్కడే ఉన్నంత సేపు కొంత పోరాడాడు. అతడు వెనుదిరిగిన తర్వాత మరో బ్యాట్స్‌మెన్ నిలువలేకపోయాడు.
షకీబ్.. ఒకే ఒక్కడు
ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు చేసిన షకీబ్ అల్ హాసన్.. ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో 11 వికెట్లు తీసి, 606 పరుగులు చేసి అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
మిగతా బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో తమీమ్ 8, సౌమ్య సర్కార్ 22, ముష్ఫీకర్ 16, లిట్టన్ దాస్ 32, మహ్మదుల్లా 29, మొసద్దీక్ హుస్సేన్ 16, సైఫుద్దీన్ 0, మెహదీ హాసన్ 7, ముష్తాఫిజర్ 1, మొర్తజా 15 పరుగులు చేశారు.
పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 6 వికెట్లతో చెలరేగాడు. షాదాబ్ 2, ఆమిర్, వాహబ్ రియాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అత్యంత పిన్న వయసులో ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత దక్కించుకున్నాడు షాహీన్. ఓ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీనేజర్, పాక్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడీ పాక్ యువకెరటం.