న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. లండన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్(64) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మిగతా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4 వికెట్లతో రాణించగా.. బౌల్ట్ రెండు.. ఫెర్గ్యూసన్, గ్రాండ్‌హోమ్, మిషెల్ సాంట్నర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు 45 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సౌమ్యా సర్కార్(25)ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు హెన్రీ. కాసేపటికే మరో ఓపెనర్ తమీమ్(24) ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్.. ముష్ఫీకర్ సాయంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.
-
Mix-up in the middle for Bangladesh!
— ICC (@ICC) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Shakib Al Hasan looks in good touch, but he's lost Mushfiqur to a run-out! Bangladesh have lost their third wicket.
FOLLOW #BANvNZ LIVE 🔽 https://t.co/xB88JRa8Yz pic.twitter.com/wKEVY622z0
">Mix-up in the middle for Bangladesh!
— ICC (@ICC) June 5, 2019
Shakib Al Hasan looks in good touch, but he's lost Mushfiqur to a run-out! Bangladesh have lost their third wicket.
FOLLOW #BANvNZ LIVE 🔽 https://t.co/xB88JRa8Yz pic.twitter.com/wKEVY622z0Mix-up in the middle for Bangladesh!
— ICC (@ICC) June 5, 2019
Shakib Al Hasan looks in good touch, but he's lost Mushfiqur to a run-out! Bangladesh have lost their third wicket.
FOLLOW #BANvNZ LIVE 🔽 https://t.co/xB88JRa8Yz pic.twitter.com/wKEVY622z0
షకీబ్ అర్ధశతకం..
దక్షిణాఫ్రికాపై అర్ధశతకంతో ఆకట్టుకున్న షకీబ్ మరోసారి సత్తాచాటాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ ఇన్నింగ్స్ వేగం పెంచాడు. 68 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ముష్ఫీకర్ రహీమ్(19) రనౌటైన తర్వాత మిథున్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు షకీబ్. చివరికి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
షకీబ్ ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ గాడి తప్పింది. వేగంగా పరుగులు రాబట్టడంలో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. తర్వాత వచ్చిన మొహమ్మదుల్లా 20 పరుగులు చేసి ఔట్ కాగా..హుస్సేన్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు.
కివీస్ బౌలర్లు పరుగులు కట్టడి చేస్తూ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. చివర్లో ధాటిగా ఆడేందుకు బంగ్లా బ్యాట్స్‌మెన్ కష్టపడ్డారు.