ETV Bharat / sports

రాయుడు త్రీడీ కౌంటర్​ బెడిసి కొట్టిందా? - rayudu

విజయ్ శంకర్ గాయం కారణంగా ప్రపంచకప్​కు దూరమవగా.. మయాంక్ అగర్వాల్​ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. అయితే రాయుడును కాదని మయాంక్​కు చోటు కల్పించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రాయుడు
author img

By

Published : Jul 2, 2019, 10:57 AM IST

కర్ణాటక‌ జట్టుకు అతడు ఓపెనర్. లిస్ట్ ఏ (దేశవాళీ వన్డే) క్రికెట్‌లో 75 మ్యాచ్‌లు ఆడాడు. 48.71 సగటుతో 3,605 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 2011లో అరంగేట్రం చేశాడు. 77 మ్యాచ్‌లు ఆడి 18.34 సగటుతో 1,266 పరుగులు చేశాడు. ఇవీ ప్రపంచకప్ భారత​ జట్టులో తాజాగా చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ గణాంకాలు.

గాయం కారణంగా వైదొలిగిన విజయ్ శంకర్ స్థానంలో మయాంక్​కు అవకాశం వచ్చింది. మెగాటోర్నీలో విజయ్ మూడు మ్యాచ్​లు ఆడి 58 పరుగులు చేసి రెండు వికెట్లు తీశాడు. ఆదివారం ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో అతడిని తప్పించి పంత్​కు అవకాశ కల్పించింది యాజమాన్యం.
ప్రస్తుతం చర్చంతా మయాంక్ అగర్వాల్ ఎంపిక గురించే. అంబటి రాయుడుకు అవకాశం ఇవ్వకుండా మయాంక్​కు చోటు లభించడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది.

రాయుడు సరిపోడా..?

పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో నాలుగో స్థానానికి రాయుడు సరైనవాడని కోహ్లీ నుంచి ప్రశంసలు పొందినా ఫలితం లేదు. న్యూజిలాండ్‌ గడ్డపై భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచినా సెలెక్టర్ల దృష్టికి రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత జట్టుకు నాలుగో స్థానంలో నమ్మదగ్గ బ్యాట్స్​మన్ అవసరం. మిడిలార్డర్​లో మంచి ఇన్నింగ్స్ ఆడగల సమర్థుడు రాయుడు. భారీ భాగస్వామ్యాలూ నెలకొల్పగలడు. మరి రాయుడును కాదని మయాంక్​కు అవకాశం కల్పించడమే ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది.

త్రీడీ ట్వీట్ ప్రభావం!

ధావన్ గాయపడితే యువ ఆటగాడు పంత్​కు అవకాశం కల్పించిన సెలక్టర్లు.. తాజాగా విజయ్ శంకర్ స్థానంలో ఇప్పటివరకు ఒక్క వన్డే కుడా ఆడని మయాంక్​ను ఎంపికచేశారు. దీనిని బట్టి చూస్తే రాయుడు చేసిన త్రీడీ ట్వీట్ ప్రభావం చూపించిందని అర్థమవుతోంది.

mayank-agarwal-replace-injured-vijay-shankar
రాయుడు ట్వీట్

ప్రపంచకప్​లో రాయుడును కాదని విజయ్ శంకర్​ను ఎంపికచేసింది యాజమాన్యం. విజయ్ శంకర్ బ్యాటింగ్​, బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ రాణిస్తాడని, అతడు త్రీడీ ఆటగాడని భారత జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఈ విషయంపై రాయుడు స్పందిస్తూ.. "ప్రపంచకప్​ను చూడటానికి త్రీడీ కళ్లజోడు ఆర్డర్​ చేశాను" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇపుడీ ట్వీట్ రాయుడు ఎంపికపై ప్రభావం చూపిందని ప్రేక్షకులతో పాటు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి.. అలెన్ అద్భుత క్యాచ్.. మ్యాచ్​కే హైలైట్

AP Video Delivery Log - 0400 GMT News
Tuesday, 2 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0229: Internet Iran Nuclear AP Clients Only 4218541
'Seriously:' Iran reacts to White House statement
AP-APTN-0210: US TX Deported Man AP Clients Only 4218540
Man deported to El Salvador allowed to back in US
AP-APTN-0207: Hong Kong Morning AP Clients Only 4218539
Aftermath and clean up in Hong Kong
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.