ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో నెగ్గి ఫైనల్ చేరింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో కివీస్ రెండో సారి ఫైనల్ చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 221 పరుగలకు ఆలౌటైంది. జడేజా(77), ధోని(50) ఆకట్టుకున్నప్పటికీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, బౌల్ట్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
3 వికెట్లతో ఆకట్టుకున్న మ్యాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.