"పసికూనపై భారత్ సులభంగా విజయం సాధిస్తుంది.. కోహ్లీసేన.. ముందు బ్యాటింగ్ చేస్తే ఆ పరుగుల సునామీలో అఫ్గాన్ కొట్టుకుపోతుంది". మ్యాచ్‌కు ముందు భారత అభిమానులు ఊహగానాలివి. అయితే అనుకోని రీతిలో అఫ్గానిస్థాన్ భారత్‌ను కట్టడి చేసింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో... భారత బౌలర్లు విజృంభించారు. చివరికి 11 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది భారత్. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది 50వ విజయం కావడం విశేషం.
షమీ చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి మ్యాచ్‌ను గెలిపించాడు. అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ నబీ (52) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రహ్మత్ షా (36) ఓ ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా.. బుమ్రా, చాహల్, పాండ్య తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
రెండు కీలక వికెట్లు పడగొట్టిను జస్ప్రీత్ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
-
#GulbadinNaib on Jasprit Bumrah: "Credit goes to him, how he bowled in the last two, three overs was superb"#SpiritOfCricket #INDvAFG pic.twitter.com/aGxLCrL3yK
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GulbadinNaib on Jasprit Bumrah: "Credit goes to him, how he bowled in the last two, three overs was superb"#SpiritOfCricket #INDvAFG pic.twitter.com/aGxLCrL3yK
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019#GulbadinNaib on Jasprit Bumrah: "Credit goes to him, how he bowled in the last two, three overs was superb"#SpiritOfCricket #INDvAFG pic.twitter.com/aGxLCrL3yK
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019
225 పరుగుల లక్ష్యచేదనతో బరిలో దిగిన అఫ్గాన్.. ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించింది. జట్టు స్కోరు 20 పరుగులున్నప్పుడు ఓపెనర్ హజ్రతుల్లాను ఔట్ చేసి దెబ్బతీశాడు షమీ. అనంతరం వచ్చిన గుల్బదీన్ నయీబ్ (27), రహ్మత్ షా (36)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతోన్న ఈ ద్వయాన్ని పాండ్య విడదీశాడు. అనంతరం హష్మతుల్లాతో (21) కలిసి స్కోరు వేగాన్ని పెంచాడు రహ్మత్ షా.
మలుపు తిప్పిన బుమ్రా
భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ క్రీజులో పాతుకుపోయారు. స్కోరు నిదానంగా ముందుకు సాగుతోన్న సమయంలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు బుమ్రా. ఒకే ఓవర్లో రహ్మత్ షా, హష్మతుల్లాలను ఔట్ చేశాడు.
గుబులురేపిన నబీ..
రహ్మత్ షా, హష్మతుల్లా ఔటైన తర్వాత నబీ చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. 55 బంతుల్లో 52 పరుగులుతో ఆకట్టుకున్నాడు. ఆఖరి వరకు నిలబడి భారత్‌కు విజయాన్ని దూరం చేసేంత పని చేశాడు.
చివర్లో ఉత్కంఠ.. షమీ హ్యాట్రిక్
-
👆 👆 👆
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Nerves of steel from Mohammad Shami.#CWC19 | #INDvAFG pic.twitter.com/H9CLRVMNdd
">👆 👆 👆
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019
Nerves of steel from Mohammad Shami.#CWC19 | #INDvAFG pic.twitter.com/H9CLRVMNdd👆 👆 👆
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019
Nerves of steel from Mohammad Shami.#CWC19 | #INDvAFG pic.twitter.com/H9CLRVMNdd
ఆఖరి ఓవర్లో అఫ్గాన్ గెలవాలంటే 16 పరుగులు కావాలి. మొదటి బంతినే ఫోర్‌గా మలిచి అప్గాన్ అభిమానుల్లో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు నబీ. రెండో బంతినీ షాట్ ఆడగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. ఆ బంతికి స్కోరేమి రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన నబీ లాంగ్ ఆన్‌లో పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. నాలుగో బంతికి అఫ్తాబ్‌ను బౌల్డ్ చేశాడు షమీ. ఐదో బంతికి ముజీబుర్ రెహమాన్‌నూ బౌల్డ్ చేసి భారత్ గెలుపును ఖాయం చేశాడు. ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 1987లో చేతన్ శర్మ తీశాడు.
-
Afghanistan are now out of contention for the #CWC19 semi-finals. pic.twitter.com/YtTE32vPfW
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Afghanistan are now out of contention for the #CWC19 semi-finals. pic.twitter.com/YtTE32vPfW
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019Afghanistan are now out of contention for the #CWC19 semi-finals. pic.twitter.com/YtTE32vPfW
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019
-
Mohammed Shami joins an elite club as he becomes the ninth player to take a hat-trick in men's World Cups! 👏#CWC19 | #TeamIndia pic.twitter.com/X3wWKCa90B
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mohammed Shami joins an elite club as he becomes the ninth player to take a hat-trick in men's World Cups! 👏#CWC19 | #TeamIndia pic.twitter.com/X3wWKCa90B
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019Mohammed Shami joins an elite club as he becomes the ninth player to take a hat-trick in men's World Cups! 👏#CWC19 | #TeamIndia pic.twitter.com/X3wWKCa90B
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 224 పరుగులు చేసింది. కోహ్లీ (67), కేదార్ జాదవ్ (52) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. వేగంగా పరుగులు చేయలేక భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. అప్గాన్ బౌలర్లలో నబీ, గుల్బదీన్ నయీబ్ చెరో 2 వికెట్లు తీశారు.