ETV Bharat / sports

భారత్​లో 2022 మహిళల ఫుట్​బాల్ ఆసియాకప్!

మహిళల ఫుట్​బాల్ ఆసియాకప్​ టోర్నీ నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. 2022లో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు వేలంలో పేరును నమోదు చేసింది. చైనీస్ తైపి, ఉజ్బెకిస్థాన్​ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు ముందుకొచ్చాయి.

ఆసియాకప్
author img

By

Published : Jun 1, 2019, 10:12 PM IST

2022లో మహిళల ఫుట్​బాల్​ ఆసియాకప్ టోర్నమెంట్​కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్​ ఆసక్తి చూపుతోంది. మనదేశంతో పాటు చైనీస్ తైపి, ఉజ్బెకిస్థాన్​లు టోర్నీ నిర్వహించేందుకు వేలంలో తమ పేర్లు నమోదు చేశాయి. మే 31తో ఈ గడువు ముగిసింది.

ఆతిథ్యమిచ్చేది ఎవరనేది 2020 రెండో త్రైమాసికంలో ప్రకటిస్తారు. ఇంతకుముందు భారత్​ 1979లో మహిళల ఫుట్​బాల్ ఆసియాకప్​ టోర్నీని హోస్ట్ చేసింది. చైనీస్ తైపి 2001లో నిర్వహించింది.

1979, 1983లో భారత్ రన్నరప్​గా నిలిచింది. ఆసియాలోని టాప్ 8 జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. మహిళా క్రీడా పోటీలకు సంబంధించి ప్రపంచంలోనే పురాతనమైనదిగా వీటికి పేరుంది. మొట్టమొదటగా 1975లో ఈ టోర్నీ నిర్వహించారు. 2022లో 20వ సారి జరపనున్నారు.

Special Advisory
Saturday 1st June 2019
Clients, please note the following addition to our output.
MOTOGP: Qualifying highlights ahead of the Italian MotoGP at Mugello. Expect at 1600.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.