సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తాచాటారు. భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. వరుస విరామాల్లో ప్రోటీస్ బ్యాట్స్‌మెన్‌ను పెవీలియన్‌కు పంపింది టీమ్ఇండియా. చివర్లో ఆల్‌రౌండర్ మోరిస్(42) దూకుడుగా ఆడటం వల్ల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
-
South Africa are still fighting!
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Chris Morris and Kagiso Rabada have added 50 for the eighth wicket.#SAvIND #ProteaFire pic.twitter.com/52lL0ZIvmZ
">South Africa are still fighting!
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
Chris Morris and Kagiso Rabada have added 50 for the eighth wicket.#SAvIND #ProteaFire pic.twitter.com/52lL0ZIvmZSouth Africa are still fighting!
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
Chris Morris and Kagiso Rabada have added 50 for the eighth wicket.#SAvIND #ProteaFire pic.twitter.com/52lL0ZIvmZ
ప్రోటీస్ సారథి డూప్లెసిస్(38), బౌలర్ రబాడా(31*) మిల్లర్(31) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో రాణించగా.. బుమ్రా, భువనేశ్వర్ రెండేసి వికెట్లు తీశారు.
-
India need 228 to win their #CWC19 opener! A fighting stand by Morris and Rabada has given South Africa something to defend.
— ICC (@ICC) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
FOLLOW #SAvIND LIVE 🔽 https://t.co/BRFVfISGgy pic.twitter.com/64yw1AaqWf
">India need 228 to win their #CWC19 opener! A fighting stand by Morris and Rabada has given South Africa something to defend.
— ICC (@ICC) June 5, 2019
FOLLOW #SAvIND LIVE 🔽 https://t.co/BRFVfISGgy pic.twitter.com/64yw1AaqWfIndia need 228 to win their #CWC19 opener! A fighting stand by Morris and Rabada has given South Africa something to defend.
— ICC (@ICC) June 5, 2019
FOLLOW #SAvIND LIVE 🔽 https://t.co/BRFVfISGgy pic.twitter.com/64yw1AaqWf
బుమ్.. బుమ్.. బుమ్రా..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ జట్టుకు ఆరంంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్లోనే ఆమ్లాను బుమ్రా ఔట్ చేశాడు. బుమ్రా స్వింగ్‌ను ఎదుర్కోలేక స్లిప్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు ఆమ్లా. అప్పటికీ దక్షిణాఫ్రికా స్కోరు 11 పరుగులే. అనంతరం కాసేపటికే డికాక్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు బుమ్రా. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా.
తిప్పేసిన చాహల్..
తర్వాత క్రీజులోకి వచ్చిన డూప్లెసిస్, డసెన్ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీశాడు చాహల్. ఓకే ఓవర్లో డసెన్, డూప్లెసిస్‌ను ఔట్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు. డుమినిని కుల్దీప్ యాదవ్ పెవీలియన్‌కు పంపాడు. 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ప్రొటీస్.
చివర్లో మోరిస్ మెరుపులు...
ఆ తర్వతా క్రీజులోకి వచ్చిన మిల్లర్, పెలుక్వాయో వికెట్ల పతానాన్ని కొంత సేపు అడ్డుకున్నారు. మిల్లర్‌ను ఔట్ చేసి మళ్లీ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు చాహల్. కాసేపటికే ఫెలుక్వాయోను కూడా స్టంపింగ్ ద్వారా వెనక్కిపంపాడు. ఆ తర్వాత వచ్చిన క్రిస్ మోరిస్ దూకుడుగా ఆడి దక్షిణాఫ్రికా స్కోరును పెంచేశాడు. 42 పరుగులతో ప్రోటీస్ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రబాడా కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 49వ ఓవర్ తొలి బంతికి మోరిస్‌ను భువనేశ్వర్ ఔట్ చేసి ఈ జోడిని విడదీశాడు. చివరి బంతికి తాహిర్‌ను ఔట్ చేశాడు భువి.
తొలుత బౌన్సర్లు, స్పిన్‌తో విరుచుకుపడ్డ టీమ్ ఇండియా బౌలర్లు దక్షిణాఫ్రికాను నిలువరించడంలో సఫలమయ్యారు.