2003 మార్చి 1... భారత్-పాక్ మధ్య ప్రపంచకప్ 36వ మ్యాచ్. గెలిచిన జట్టు సెమీఫైనల్ చేరుతుంది. నాలుగోసారి ప్రపంచకప్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. అప్పటివరకు భారత్ ఒక్కసారి పాక్‌పై ఓడిపోలేదు. ఆ రికార్డు నిలబెట్టడానికి సచిన్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.
సెంచూరియన్ మైదానంలో వకార్ యూనిస్ నేతృత్వంలోని పాక్ జట్టు, దాదా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు యూనిస్. పాక్ ఆటగాడు సయీద్ అన్వర్(101) పరుగులు చేయటం వల్ల 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది దాయాది దేశం.
ఈ స్కోరు ఛేదించడం టీమిండియాకు అంత సులువేం కాదు. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్ల జాబితాలోని షోయబ్ అక్తర్, వసీమ్ అక్రమ్, వకార్లతో పాక్ పేస్ లైనప్ పటిష్ఠంగా ఉంది.
తడబడితే మాస్టర్ నిలబెట్టాడు...
ఓపెనర్‌గా బరిలోకి దిగిన సెహ్వాగ్ మూడు బౌండరీలతో మంచి ఆరంభమిచ్చినా... 14 బంతుల్లో 21 పరుగుల తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సౌరవ్ గంగూలీ మరుసటి బంతికే డకౌట్‌గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సచిన్ అవతలి ఎండ్‌లో ఉండి ఆడుతున్నాడు. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌కు మొహమ్మద్ కైఫ్‌తో కలిసి చక్కటి ఇన్నింగ్స్ అందించాడు మాస్టర్ బ్లాస్టర్. కైఫ్ 60 బంతుల్లో 35 పరుగులతో మంచి సహకారం అందించినా... త్వరగా ఔటయ్యాడు.
సచిన్ తెందూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లోనే సచిన్ వన్డేల్లో 12వేల మైలురాయిని అందుకున్నాడు. కాని చివరకు అక్తర్ గంటకు 147 కి.మీ వేగంతో వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో సెంచరీ సాధించకుండానే పెవిలియన్ చేరాడు మాస్టర్.
నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న భారత్‌ను యువీ అర్థశతకం , ద్రవిడ్ 44 పరుగులు చేసి ముందుకు నడిపించారు. ఫలితంగా మరోసారి పాక్‌పై చారిత్రక విజయం టీమిండియా సొంతమైంది. 45.4 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేదించింది భారత జట్టు. ఆరువికెట్ల తేడాతో గెలుపొందింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తొలిసారి సచిన్‌కు బైరన్నర్...
ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సచిన్ తన కెరీర్లో తొలిసారి ఈ మ్యాచ్‌లోనే బైరన్నర్‌ను ఉపయోగించుకున్నాడు. తొడ కండరాలు పట్టేయడం మూలంగా పరిగెత్తడానికి ఇబ్బంది పడిన మాస్టర్... సెహ్వాగ్ సహాయం తీసుకున్నాడు.
ఇవీచూడండి--> WC19: అత్యధిక పరుగుల వీరులు వీరే