వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్ గురువారం తన ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడాడు. లీడ్స్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన పోరులో గేల్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. వీడ్కోలు మ్యాచ్‌లో 18 బంతులాడిన హిట్టర్... 7 పరుగులు మాత్రమే సాధించాడు.
-
This is the last time we'll see @henrygayle at a Cricket World Cup💔..wow😢...how do you say goodbye?😪 pic.twitter.com/5nY6EVX4Fs
— Windies Cricket (@windiescricket) July 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is the last time we'll see @henrygayle at a Cricket World Cup💔..wow😢...how do you say goodbye?😪 pic.twitter.com/5nY6EVX4Fs
— Windies Cricket (@windiescricket) July 4, 2019This is the last time we'll see @henrygayle at a Cricket World Cup💔..wow😢...how do you say goodbye?😪 pic.twitter.com/5nY6EVX4Fs
— Windies Cricket (@windiescricket) July 4, 2019
రెండు మిస్...
- అఫ్గాన్‌తో మ్యాచ్‌లో క్రిస్‌గేల్ 18 పరుగులు చేస్తే.. విండీస్ తరఫున దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియన్‌లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసేవాడు. లారా 295 మ్యాచ్‌ల్లో 10348 పరుగులు చేసి ముందంజలో ఉండగా గేల్ ప్రస్తుతం 295 మ్యాచ్‌ల్లో 10338 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
- ఇదే మ్యాచ్‌లో 47 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తరఫున లారా పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (1225)ను అధిగమించేవాడు.
- ప్రపంచకప్ కెరీర్ చివరి ఆటలో శతకం సాధిస్తే ఏకంగా వివియన్ రిచర్డ్స్ సరసన చోటుదక్కించుకొనేవాడు. కాని ఆ అవకాశాన్నీ కోల్పోయాడు. ప్రపంచకప్‌లో రిచర్డ్స్ మూడు శతకాలు సాధించగా గేల్ ప్రస్తుతం రెండు శతకాలతోనే గుడ్‌బై చెప్పేశాడు.
1186 పరుగులు... 16 వికెట్లు
5 ప్రపంచకప్‌లు ఆడిన గేల్...1186 పరుగులు చేశాడు. 90.56 స్టయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు. మెగాటోర్నీలో సగటు 35.93గా ఉంది. వన్డే ప్రపంచకప్‌లో 49 సిక్స్‌లు కొట్టిన గేల్..2 శతకాలు సాధించాడు. వాటిలో 215 పరుగులు అత్యుత్తమం. బౌలింగ్‌లోనూ రాణించిన క్రిస్...16 వికెట్లు తీశాడు.
-
What a World Cup Career - 1186 runs | 34 innings | 16 wickets...and a whole lot of fan love🤗 Thank you @henrygayle! ❤#CWC19 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/6PuICcVSOz
— Windies Cricket (@windiescricket) July 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a World Cup Career - 1186 runs | 34 innings | 16 wickets...and a whole lot of fan love🤗 Thank you @henrygayle! ❤#CWC19 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/6PuICcVSOz
— Windies Cricket (@windiescricket) July 4, 2019What a World Cup Career - 1186 runs | 34 innings | 16 wickets...and a whole lot of fan love🤗 Thank you @henrygayle! ❤#CWC19 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/6PuICcVSOz
— Windies Cricket (@windiescricket) July 4, 2019
ప్రపంచకప్‌కు వీడ్కోలు పలికిన గేల్.. టీ20ల్లో ఇకపై ఆడనని చెప్పేశాడు. కాని మెగాటోర్నీ తర్వాత భారత్‌తో జరగనున్న వన్డే , టెస్ట్ సిరీస్‌లలో ఆడనున్నట్లు వెల్లడించాడు.