వెస్టిండీస్ పర్యటనలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉంటాడా లేదా అనే ఊహాగానాలకు తెరపడింది. మహీ అందుబాటులో ఉండట్లేదని, ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు.
"విండీస్ పర్యటనకు ధోని అందుబాటులో ఉండడు. లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మహీ వచ్చే రెండు నెలలు తన పారామిలిటరీ రెజిమెంట్‌తో గడపనున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీ, సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ ఎమ్ఎస్కే ప్రసాద్‌కు తెలియజేశాం" -బీసీసీఐ ప్రతినిధి.
ప్రస్తుతానికి ధోని రిటైర్మెంట్ తీసుకోవట్లేదని... ఇది మాత్రం స్పష్టమని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఆదివారం ప్రకటించనుంది సెలక్షన్ కమిటీ. మహీ స్థానంలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశముంది.
ఇది చదవండి: 'అప్పటి వరకు కెప్టెన్‌గానా..? పెద్ద బాధ్యతే'