ఈ ప్రపంచకప్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన బంగ్లాదేశ్‌కు సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడి ఇప్పటికే సెమీస్ ఆశలపై నీళ్లు చల్లుకుంది అఫ్గానిస్థాన్. ఈ రెండింటి మధ్య నేడు సౌతాంప్టన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
-
Snaps from Bangladesh team's final practice session ahead of the #CWC19 clash against Afghanistan on tomorrow (June 24) at Southampton.
— Bangladesh Cricket (@BCBtigers) June 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
#RiseOfTheTigers pic.twitter.com/WhqKj13YyY
">Snaps from Bangladesh team's final practice session ahead of the #CWC19 clash against Afghanistan on tomorrow (June 24) at Southampton.
— Bangladesh Cricket (@BCBtigers) June 23, 2019
#RiseOfTheTigers pic.twitter.com/WhqKj13YyYSnaps from Bangladesh team's final practice session ahead of the #CWC19 clash against Afghanistan on tomorrow (June 24) at Southampton.
— Bangladesh Cricket (@BCBtigers) June 23, 2019
#RiseOfTheTigers pic.twitter.com/WhqKj13YyY
సెమీస్ చేరాలంటే బంగ్లా గెలవాల్సిందే..
ఇంగ్లాండ్‌పై గెలిచిన శ్రీలంక సెమీస్‌పై బంగ్లాకు ఆశలు రేకెత్తించింది. పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తలో రెండింటిలో విజయం సాధించాయి. మిగిలిన మ్యాచులన్నింటిలో బంగ్లా గెలిచి.. పాక్, శ్రీలంక ఓడితే టైగర్స్‌కు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అందుకు ఈ రోజు అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది.
-
Winning percentage for Bangladesh in ODIs against Afghanistan#BCB #RiseOfTheTigers#KhelbeTigerJitbeTiger pic.twitter.com/5OYHxAbw7s
— Bangladesh Cricket (@BCBtigers) June 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Winning percentage for Bangladesh in ODIs against Afghanistan#BCB #RiseOfTheTigers#KhelbeTigerJitbeTiger pic.twitter.com/5OYHxAbw7s
— Bangladesh Cricket (@BCBtigers) June 23, 2019Winning percentage for Bangladesh in ODIs against Afghanistan#BCB #RiseOfTheTigers#KhelbeTigerJitbeTiger pic.twitter.com/5OYHxAbw7s
— Bangladesh Cricket (@BCBtigers) June 23, 2019
విండీస్‌పై 322 పరుగుల లక్ష్యాన్ని 41.3 ఓవర్లోనే సునాయాసంగానే ఛేదించింది బంగ్లాదేశ్. అదే విధంగా ఆసీస్ నిర్దేశించిన 382 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బంగ్లా.. 333 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ప్రపంచకప్‌లో 425 పరుగులు చేసి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు.
బౌలింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన చేస్తోంది బంగ్లాదేశ్. రుబెల్ హుస్సేన్, సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రెహమాన్ నిలకడగా రాణిస్తున్నారు.
ఒక్క గెలుపు కోసం అఫ్గాన్ ఎదురుచూపులు..
-
Afghan Atalan will face @BCBtigers in its seventh match of the ICC @cricketworldcup 2019 tomorrow at 2PM (AFT) at Hampshire Bowl, Southampton. #AFGvBAN #CWC19 #AfghanAtalan #InForWin pic.twitter.com/rCNVWJDZrf
— Afghanistan Cricket Board (@ACBofficials) June 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Afghan Atalan will face @BCBtigers in its seventh match of the ICC @cricketworldcup 2019 tomorrow at 2PM (AFT) at Hampshire Bowl, Southampton. #AFGvBAN #CWC19 #AfghanAtalan #InForWin pic.twitter.com/rCNVWJDZrf
— Afghanistan Cricket Board (@ACBofficials) June 23, 2019Afghan Atalan will face @BCBtigers in its seventh match of the ICC @cricketworldcup 2019 tomorrow at 2PM (AFT) at Hampshire Bowl, Southampton. #AFGvBAN #CWC19 #AfghanAtalan #InForWin pic.twitter.com/rCNVWJDZrf
— Afghanistan Cricket Board (@ACBofficials) June 23, 2019
అఫ్గానిస్థాన్ విషయానికొస్తే ప్రపంచకప్‌లో గెలుపు కోసం ఆరాటపడుతోంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాటపటిమతో అందరిని ఆకట్టుకుంది. ఇంగ్లాండ్‌పై పరాభావం నుంచి త్వరగానే కోలుకున్న అఫ్గాన్.. ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఉత్కంఠగా జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి వరకు ఆడి తృటిలో గెలుపుకు దూరమైంది. 224 పరుగుల లక్ష్య ఛేదనలో 11 పరుగులతో ఓటమి పాలైంది.
ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా.. గెలవాలనుకుంటోంది అఫ్గాన్. భారత్‌తో మ్యాచ్ మాదిరిగానే మరోసారి స్పిన్నర్లనే నమ్ముకుంటోంది. నబీ, రషీద్ ఖాన్, ముజిబుర్ రెహమాన్ లాంటి స్పినర్లు ఆ జట్టు సొంతం.
టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ నబీ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించాడు. మరోసారి అతడు సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇరుజట్లు ప్రపంచకప్‌లో ముఖాముఖీ ఓ సారి తలపడగా.. అందులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. రెండు జట్లు ఏడు వన్డేలు ఆడాయి. అందులో బంగ్లా 4, అఫ్గానిస్థాన్ 3 మ్యాచుల్లో గెలిచాయి.
జట్లు:
బంగ్లాదేశ్:
మష్రాఫే మోర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, షకిబుల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్(కీపర్), లిటన్ దాస్, మహ్మదుల్లా, సబ్బీర్ రెహమాన్, మెహదీ హసన్, రుబెల్, ముస్తాఫీజుర్ రెహమాన్.
అఫ్గానిస్థాన్:
గుల్బదీన్ నయీబ్(కెప్టెన్), హజ్రతుల్లా, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ, అస్కర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, నజీబుల్లా, రషీద్ ఖాన్, ఇక్రామ్ అలీ(కీపర్), అఫ్తాబ్ ఆలం, ముజీబుర్ రెహమాన్.