వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అందుకోసం జట్టును ఆదివారం ప్రకటించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రపంచకప్లో అంబటి రాయుడు ఎంపిక అంశంపై స్పందించాడు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. ఏ ఒక్కరి విషయంలోనూ ద్వేషం, పక్షపాతం కానీ.. తమకు లేదని చెప్పాడు ఎమ్మెస్కే.
"టీ20 ప్రదర్శనల ఆధారంగా అంబటి రాయుడును వన్డేలకు ఎంపిక చేయలేం. అలా చేస్తే విమర్శలు వస్తాయి. అతడిపై మాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. రాయుడు ఫిట్నెస్ పరీక్షలో విఫలమైనప్పుడు, సంబంధిత శిబిరానికి పంపించాం. కొన్ని పరిస్థితుల వల్ల ప్రపంచకప్ జట్టులోకి తీసుకోలేకపోయాం. అది సెలక్షన్ కమిటీ తప్పు కాదు. రాయుడు భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం. మెగాటోర్నీ కోసం ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా చేశాం. మాకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఏ ఒక్కరి విషయంలోనూ ద్వేషం, పక్షపాతం మాకు లేదు."
-ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్
ఇది చదవండి: వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన