ఆస్ట్రేలియాXఇంగ్లాండ్ మధ్య బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. ఈ దశలో ఐదవ స్థానంలో క్రీజులోకి వచ్చిన అలెక్స్ కేరీ... ఇంగ్లీష్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి గాయపడ్డాడు. ఆర్చర్ వేసి బంతి అలెక్స్ కేరీ హెల్మెట్‌ను పడగొట్టి దవడ భాగం వద్ద బలంగా తాకింది. ఫలితంగా బాగా రక్తం రాగా... అంపైర్లు మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు.
ఓ వైపు కష్టాల్లో ఉన్న జట్టును చూసిన కేరీ... ప్రథమ చికిత్స చేయించుకొని బ్యాటింగ్‌కు దిగాడు. అందరూ రిటైర్ట్ హర్ట్ అవుతాడని అనుకున్నా రక్తం కారుతున్న చోట ప్లాస్టర్ వేసుకుని మైదానంలో ఆటను కొనసాగించాడు. ఓ పక్క గాయం ఇబ్బంది పెడుతున్నా 46 పరుగుల(70 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు.
-
Alex Carey injured but still Playing 👌#ENGvAUS pic.twitter.com/giY3ojh0xg
— Syed Atif (@_SmokeDream_) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Alex Carey injured but still Playing 👌#ENGvAUS pic.twitter.com/giY3ojh0xg
— Syed Atif (@_SmokeDream_) July 11, 2019Alex Carey injured but still Playing 👌#ENGvAUS pic.twitter.com/giY3ojh0xg
— Syed Atif (@_SmokeDream_) July 11, 2019
నాలుగు పరుగులకే కెప్టెన్ ఆరోన్ ఫించ్ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఆరు పరుగులకే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(9)ను క్రిస్‌వోక్స్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న హ్యాండ్స్కాంబ్ (4) పరుగులే చేసి నిరాశపరిచాడు.