ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన పోరులో ఆ జట్టు సారథి కరుణరత్నె(10) వికెట్ తీసిన ఈ స్పీడ్‌స్టర్... కెరీర్లో వందో వికెట్ సాధించాడు. అతి తక్కువ వన్డేల్లో(57) ఈ రికార్డు సృష్టించిన రెండో భారత బౌలర్ బుమ్రా. జస్ప్రీత్ కంటే ముందు మహ్మద్ షమి 56 వన్డేల్లోనే శతక వికెట్ల మార్కు అందుకున్నాడు. తర్వాత స్థానాల్లో ఇర్ఫాన్ పఠాన్ (59), జహీర్ ఖాన్ (65), అజిత్ అగార్కర్(67), జవగళ్ శ్రీనాథ్ (68) ఉన్నారు.
-
100 and counting 😎😎
— BCCI (@BCCI) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to @Jaspritbumrah93 👏👏 #TeamIndia #SLvIND #CWC19 pic.twitter.com/p0RLvXUkiR
">100 and counting 😎😎
— BCCI (@BCCI) July 6, 2019
Congratulations to @Jaspritbumrah93 👏👏 #TeamIndia #SLvIND #CWC19 pic.twitter.com/p0RLvXUkiR100 and counting 😎😎
— BCCI (@BCCI) July 6, 2019
Congratulations to @Jaspritbumrah93 👏👏 #TeamIndia #SLvIND #CWC19 pic.twitter.com/p0RLvXUkiR
ప్రపంచక్రికెట్లో చూస్తే తక్కువ వన్డేల్లో వంద వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. 44 వన్డేల్లోనే ఈ రికార్డు సాధించాడీ సంచలన బౌలర్. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(52 వన్డేల్లో), సక్లయిన్ ముస్తాక్ (పాకిస్థాన్-53) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
వన్డే వరల్డ్‌కప్‌లోని ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంకేయులపై 7 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన బుమ్రా... ప్రస్తుతం 102 వికెట్లతో కొనసాగుతున్నాడు.