పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ పేసర్ భువనేశ్వర్ తర్వాత 2-3 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. భువీ తన మూడో ఓవర్ వేస్తున్న సమయంలో స్లిప్ అయ్యాడు. గాయంతో మైదానం వీడిన అతడి స్థానంలో జడేజా ఫీల్డింగ్ చేశాడు.
"బౌలింగ్ వేస్తున్న సమయంలో భువీ స్లిప్ అయ్యాడు. రెండు, మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరతాడు. అతడు తుదిజట్టులో ఉండటం చాలా అవసరం".
-కోహ్లీ, టీమిండియా సారథి
భువనేశ్వర్ స్థానంలో షమి ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భువీ మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటికే భారత ఓపెనర్ ధావన్ గాయంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఇవీ చూడండి.. విజయమే కాదు... రికార్డులూ ఏకపక్షమే!