గాయం కారణంగా అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్పింగ్స్టర్ భువనేశ్వర్ కుమార్... మాంచెస్టర్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పంచుకుంది బీసీసీఐ. 'నెట్స్‌లో ఎవరున్నారో చూడండి' అంటూ షేర్ చేసింది.
-
Look who's back in the nets 💪💪#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn
— BCCI (@BCCI) June 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Look who's back in the nets 💪💪#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn
— BCCI (@BCCI) June 25, 2019Look who's back in the nets 💪💪#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn
— BCCI (@BCCI) June 25, 2019
మంగళవారం దాదాపు 35 నిముషాల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు భువి. గాయం కారణంగా దూరమైన అతడు ప్రాక్టీస్ సమయంలో పెద్దగా ఇబ్బంది పడలేదని, ఇది మంచి సూచన అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే గురువారం జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా..లేదా అనే దానిపై స్పష్టత లేదు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కండరాల గాయం కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరం కావొచ్చని అంచనా వేశారు. ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ ఐదు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 2 వికెట్లు తీయగా... ఆసీస్‌పై మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి: నేడు న్యూజిలాండ్‌తో పాక్ ఢీ- సెమీస్‌పై కివీస్ కన్ను