ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు ఏ మాత్రం తీసిపోని ప్రదర్శన చేస్తోంది బంగ్లాదేశ్ జట్టు. ఈ విజయాల్లో స్టార్ ఆల్ రౌండర్ షకిబుల్ది కీలకపాత్ర. జట్టుకు అవసరమైన పరుగులు సాధిస్తూ.. కీలక వికెట్లను పడగొట్టి జట్టు గెలుపునకు కృషి చేస్తున్నాడు.
అఫ్గాన్‌తో మ్యాచ్ తర్వాత్ షకిబుల్ మీడియాతో మాట్లాడుతూ.. "భారత్‌తో జరిగే మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు భారత్. వారిని ఓడించడం అంత సులువు కాదు. కానీ మేం గట్టి పోటీనిస్తాం. టీమిండియాలో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా వారికుంది. మేం మా సాయశక్తుల పోరాడుతాం. భారత్‌ను ఓడించే సత్తా మాకు ఉంది".
-షకిబుల్ హసన్, బంగ్లాదేశ్ క్రికెటర్
ఒక ప్రపంచకప్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు, పది వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా షకిబ్ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి 476 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.
జులై 2న భారత్‌తో బంగ్లా మ్యాచ్ ఉంది. దాదాపు వారానికి పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించింది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా 3 గెలిచి 7 పాయింట్లతో 5 స్థానంలో నిలిచింది.
ఇవీ చూడండి.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం లారాకు అస్వస్థత