వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది విండీస్. ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగింది విండీస్. కరీబీయన్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్(68), హోల్డర్(51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ స్టార్క్ ఐదు వికెట్లతో విజృంభించగా... కమిన్స్ రెండు, ఆడమ్ జంపా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
92 పరుగులతో ఆకట్టుకున్న ఆసీస్ ఆటగాడు నాథన్ కౌల్టర్‌నైల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
-
Nathan Coulter-Nile is the Player of the Match after his record-breaking performance with the bat!
— cricket.com.au (@cricketcomau) June 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
More HERE: https://t.co/DmqdtH1WzI #CWC19 pic.twitter.com/ojfVemBIRb
">Nathan Coulter-Nile is the Player of the Match after his record-breaking performance with the bat!
— cricket.com.au (@cricketcomau) June 6, 2019
More HERE: https://t.co/DmqdtH1WzI #CWC19 pic.twitter.com/ojfVemBIRbNathan Coulter-Nile is the Player of the Match after his record-breaking performance with the bat!
— cricket.com.au (@cricketcomau) June 6, 2019
More HERE: https://t.co/DmqdtH1WzI #CWC19 pic.twitter.com/ojfVemBIRb
289 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లూయిస్(1).. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాసేపటికీ క్రిస్ గేల్‌ను(21) పెవిలియన్ చేర్చాడు కమిన్స్. అనంతరం నీకోలస్ పూరన్(40), షాయ్ హోప్ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పూరన్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు జంపా.
షాయ్ హోప్, హోల్డర్ అర్ధశతకాలు..
పూరన్ ఔటైన తర్వాత హోప్, హోల్డర్ నిలకడగా ఆడారు. హోప్ ఆచితూచి ఆడగా.. హోల్డర్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 68 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో హోప్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన రసెల్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో స్టార్క్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అర్ధశతకం పూర్తి చేసి హోల్డర్ కూడా ఔటయ్యాడు. వేగంగా 150 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టార్క్ ఘనత సాధించాడు. 77 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు.
ఐదు వికెట్లు తీసిన స్టార్క్
-
Starc brings up 150 ODI wickets with his fourth today! https://t.co/RqRhhjpZwe #CWC19 pic.twitter.com/KGWMD2n04F
— cricket.com.au (@cricketcomau) June 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Starc brings up 150 ODI wickets with his fourth today! https://t.co/RqRhhjpZwe #CWC19 pic.twitter.com/KGWMD2n04F
— cricket.com.au (@cricketcomau) June 6, 2019Starc brings up 150 ODI wickets with his fourth today! https://t.co/RqRhhjpZwe #CWC19 pic.twitter.com/KGWMD2n04F
— cricket.com.au (@cricketcomau) June 6, 2019
ప్రమాదకరంగా మారుతున్న రసెల్‌ను(15) ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు స్టార్క్. అనంతరం ఓకే ఓవర్లో బ్రాత్‌వైట్(16), హోల్డర్‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం షెల్డాన్ కాట్రెల్‌ను(1) కూడా ఔట్ చేసి ఈ ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు స్టార్క్.
హోల్డర్ ఔటైన తర్వాత విండీస్ ఓటమి దాదాపు ఖారారైంది. చివరి ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టిన విండీస్ ఆటగాడు నర్స్(19) పరుగుల తేడాను మాత్రం తగ్గించగలిగాడు.
-
Five-wicket hero Mitchell Starc leads the victorious Australians off the field. #CWC19 pic.twitter.com/FanCT0Y19x
— Cricket World Cup (@cricketworldcup) June 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Five-wicket hero Mitchell Starc leads the victorious Australians off the field. #CWC19 pic.twitter.com/FanCT0Y19x
— Cricket World Cup (@cricketworldcup) June 6, 2019Five-wicket hero Mitchell Starc leads the victorious Australians off the field. #CWC19 pic.twitter.com/FanCT0Y19x
— Cricket World Cup (@cricketworldcup) June 6, 2019
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 288 పరుగులు చేసింది. కౌల్టర్‌నైల్(92), స్టీవ్ స్మిత్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 38 ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను వీరిద్దరూ రాణించి జట్టుకు మంచి స్కోరునందించారు. 60 బంతుల్లో 92 పరుగులు చేసిన కౌల్టర్ నైల్ కొద్దిలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు.
విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ మూడు.. థామస్, షెల్డన్, రసెల్ తలో రెండు వికెట్లు తీశారు.