ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(166, 147 బంతుల్లో) శతకంతో రెచ్చిపోగా.. ఖవాజా(89), ఆరోన్ ఫించ్(53) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
బంగ్లా బౌలర్లు.. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సౌమ్యా సర్కార్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు వార్నర్- ఫించ్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. అర్ధశతకం చేసి సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు ఫించ్.
శతకంతో రెచ్చిపోయిన వార్నర్
-
Century for David Warner! 👏
— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It's his second of the tournament to go with two half-centuries as well.
What a comeback to international cricket! #CWC19 | #CmonAussie pic.twitter.com/h1aZSZwLnQ
">Century for David Warner! 👏
— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019
It's his second of the tournament to go with two half-centuries as well.
What a comeback to international cricket! #CWC19 | #CmonAussie pic.twitter.com/h1aZSZwLnQCentury for David Warner! 👏
— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019
It's his second of the tournament to go with two half-centuries as well.
What a comeback to international cricket! #CWC19 | #CmonAussie pic.twitter.com/h1aZSZwLnQ
నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన డేవిడ్ వార్నర్ అనంతరం తనదైన శైలిలో దూకుడు పెంచాడు. 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని కెరీర్లో 16వ శతకాన్ని నమోదు చేశాడు. వంద పరుగుల మైలురాయి తర్వాత మరింత విజృంభించాడు . ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 147 బంతుల్లో 166 పరుగులు చేసి సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో రుబెల్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఖవాజా అర్ధశతకం
-
5️⃣0️⃣ for Khawaja!
— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It's his first of #CWC19, and he brings up the mark of 50 balls, putting on a 100-run stand with Warner.
How much further can they go?
Follow #CWC19 live on our app!
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR#CWC19 | #CmonAussie pic.twitter.com/z4jZlxz163
">5️⃣0️⃣ for Khawaja!
— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019
It's his first of #CWC19, and he brings up the mark of 50 balls, putting on a 100-run stand with Warner.
How much further can they go?
Follow #CWC19 live on our app!
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR#CWC19 | #CmonAussie pic.twitter.com/z4jZlxz1635️⃣0️⃣ for Khawaja!
— Cricket World Cup (@cricketworldcup) June 20, 2019
It's his first of #CWC19, and he brings up the mark of 50 balls, putting on a 100-run stand with Warner.
How much further can they go?
Follow #CWC19 live on our app!
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR#CWC19 | #CmonAussie pic.twitter.com/z4jZlxz163
ఫించ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఖవాజా ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. వార్నర్‌తో కలిసి 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 72 బంతుల్లో 89 పరుగులు చేసి సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.
చివర్లో ధాటిగా ఆడిన మాక్సీ..
ఆసీస్ బ్యాట్స్‌మెన్ మాక్స్వెల్ చివర్లో వేగంగా ఆడాడు. 10 బంతుల్లోనే 32 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఉన్నంతసేపు బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నాడు.
మాక్స్వెల్ ఔటైన తర్వాత ఆసీస్ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. వెంటవెంటనే ఖవాజా, స్మిత్(1) ఔట్ కాగా.. చివర్లో స్కోరు కాస్త తగ్గింది.
చివరి ఓవర్ ముందు మ్యాచ్‌ను వర్షం కాసేపు అడ్డుకుంది. అనంతరం ప్రారంభం కాగా.. ఆ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెండు ఫోర్లు సహా 13 పరుగులు ఇచ్చాడు.
ఇది చదవండి: టీమిండియాను వదలని గాయాల బెడద!