ETV Bharat / sports

ప్రపంచ ఎలెవన్​తో మ్యాచ్​కు కోహ్లీ సందేహమే - విరాట్​ కోహ్లీ

బంగ్లాదేశ్​లో జరగబోయే ప్రపంచ ఎలెవన్-ఆసియా ఎలెవన్​ మ్యాచ్​లో కోహ్లీ ఆడటం సందేహంగా కనిపిస్తోంది. వచ్చే నెల 21-22 తేదీల్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

Asia XI T20Is: BCCI to give names only after evaluating Kohli & Co's workload
ప్రపంచ ఎలెవన్​తో మ్యాచ్​కు కోహ్లీ సందేహమే
author img

By

Published : Feb 28, 2020, 7:40 PM IST

Updated : Mar 2, 2020, 9:35 PM IST

బంగ్లాదేశ్​ వేదికగా వచ్చే నెలలో ప్రపంచ ఎలెవన్, ఆసియా ఎలెవన్​ మధ్య రెండు టీ20 మ్యాచ్​లు జరగనున్నాయి. టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ఇందులోని కనీసం ఒక్క మ్యాచ్​లోనైనా ఆడతాడని బంగ్లా క్రికెట్ బోర్డు ఇంతకు ముందే చెప్పింది. అయితే విరాట్.. ఈ విషయమై​ ఎలాంటి నిర్ణయాన్ని ఇంతవరకు చెప్పలేదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.

"బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) 10 మంది ఆటగాళ్ల జాబితాను పంపింది. అందులో ఐదుగురు ఆటగాళ్లను మేం పంపించాలి. కానీ ఎవర్ని పంపించాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఆటగాళ్లకు వర్క్​లోడ్, మెడికల్ టెస్టులు జరిపిన తర్వాతే జాబితాను పంపిస్తాం"

- బీసీసీఐ సీనియర్​ అధికారి

బంగ్లాదేశ్​ వ్యవస్థాపకుడు షేక్ ముజీబర్ రెహ్మాన్ శతాబ్ది జయంతి వేడుక సందర్భంగా ఈ మ్యాచ్​లు నిర్వహిస్తున్నారు. ఢాకాలో వచ్చే నెల 21, 22 తేదీల్లో ఇవి జరగనున్నాయి.​

ప్రస్తుతం న్యూజిలాండ్​ పర్యటనలో ఉంది టీమిండియా. వచ్చే నెల 6న స్వదేశానికి వస్తుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్​ ఆడుతుంది. అదే నెల 29వ తేదీ నుంచి నుంచి ఐపీఎల్ మొదలు కానుంది.

ఇటీవలే మాట్లాడిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెటర్లకు వరుస మ్యాచ్​ల వల్ల పని ఒత్తిడి పెరుగుతందని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కోచ్ రవిశాస్త్రి.. ఇది కేవలం అతడి వ్యక్తిగతమైన అభిప్రాయమని, ఆటగాళ్లకు ఒత్తిడి ఎదురైతే వారు అధికారులకు చెప్పొచ్చని అన్నాడు.

ఇదీ చూడండి.. ఈ ఓటమి టీమిండియాకు గుణపాఠం కావాలి: రవిశాస్త్రి

Last Updated : Mar 2, 2020, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.