ప్రపంచకప్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ పరాజయం ఎరుగని కోహ్లీ సేన నేడు వెస్టిండీస్‌తో తలపడనుంది. సెమీస్ అవకాశాలు చాలా తక్కువ ఉన్న విండీస్ పరువు నిలుపుకునేందుకు భారత్‌ను ఢీ కొట్టనుంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
-
All set for the game tomorrow 💪💪#TeamIndia pic.twitter.com/86tRlhbWUj
— BCCI (@BCCI) June 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">All set for the game tomorrow 💪💪#TeamIndia pic.twitter.com/86tRlhbWUj
— BCCI (@BCCI) June 26, 2019All set for the game tomorrow 💪💪#TeamIndia pic.twitter.com/86tRlhbWUj
— BCCI (@BCCI) June 26, 2019
సెమీస్‌పై గురిపెట్టిన భారత్..
ఆడిన 5 మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచింది భారత్. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి అగ్రస్థాయి జట్లను ఓడించి సెమీస్‌పై కన్నేసింది. నేడు విండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి సెమీస్ చేరేందుకు మరో అడుగు వేయాలనుకుంటుంది.
అందరి చూపు ధోనీపైనే...
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 52 బంతులాడిన మహీ 28 పరుగులు మాత్రమే చేశాడు. ధోనీని ఎప్పుడూ వెనకేసికొచ్చే సచిన్ తెందూల్కర్ సైతం అతని ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిల్ ఆర్డ్ర్లో కీలకమైన మహీ బ్యాటింగ్ స్థానాన్ని మార్చే అవకాశం లేకపోలేదు. స్నిన్నర్లతో నిండిన అఫ్గాన్‌పై నిదానంగా ఆడిన ధోనీ.. విండీస్ ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొంటాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నాలుగో స్థానంలో విజయ్ శంకర్‌కు బదులుగా రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించాలని వాదనలు వినిపిస్తున్నాయి. అతడి దూకుడైన ఆటతీరు జట్టుకు అదనపు బలం చేకూరుస్తుందని పలువురు భావిస్తున్నారు.
-
Who does it better? #TeamIndia | #CWC19 | #MenInMaroon pic.twitter.com/DRth39BElp
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Who does it better? #TeamIndia | #CWC19 | #MenInMaroon pic.twitter.com/DRth39BElp
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019Who does it better? #TeamIndia | #CWC19 | #MenInMaroon pic.twitter.com/DRth39BElp
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
విజయమే లక్ష్యంగా విండీస్
ఆడిన 6 మ్యాచుల్లో కేవలం ఒక్క దాంట్లోనే గెలిచి.. 4 మ్యాచ్‌ల్లో ఓడింది విండీస్. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. సెమీస్ అవకాశాలు విండీస్ జట్టుకు చాలా తక్కువ.
ఈ మెగాటోర్నీలో చాలా మ్యాచ్‌ల్లో చివరి వరకు వచ్చి ఓడింది వెస్టిండీస్. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పరాజయం చెందగా.. కివీస్‌తో కేవలం 5 పరుగుల తేడాతో ఓడింది. ఆ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ శతకంతో ఒంటరి పోరాటం చేసి.. చివర్లో మ్యాచ్ జారవిడిచాడు.
వెస్టిండీస్ జట్టులో హిట్టర్లకు కొదవలేదు. క్రిస్ గేల్, షాయ్ హోప్, హిట్మైర్, బ్రాత్‌వైట్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నారు. రసెల్ దూరం కావండం జట్టుకు ప్రతికూలంశం. బౌలింగ్‌లో షెల్డన్ కాట్రెల్, థామస్ లాంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు.
తనదైన రోజున ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఛేదించే విండీస్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. 2016 టీ 20 ప్రపంచకప్ భారత్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 192 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది కరీబియన్ జట్టు.
ప్రపంచకప్‌లో భారత్ - వెస్టిండీస్ ముఖాముఖీ 8 సార్లు తలపడ్డాయి. 5 మ్యాచుల్లో టీమిండియా నెగ్గగా.. మూడు సార్లు కరీబియన్ జట్టును విజయం వరించింది.
ఇది చదవండి: 1992 ఫలితాలను పునరావృతం చేస్తోన్న పాక్