క్రికెటర్ ధోనిలానే అతడి కూతురు జీవా అంతే పాపులర్ అయింది. మహీ ఆడిన ప్రతి మ్యాచ్‌కు వస్తూ తనదైన శైలిలో సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవల ఐపీఎల్‌లోనూ అంతే అల్లరి చేసింది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో పాల్గొన్న ఈ చిన్నారి తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
తల్లి సాక్షి సింగ్ సహాయంతో సొంతంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తోంది జీవా. ప్రస్తుతం 98 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
బుధవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. రోహిత్ సెంచరీతో చెలరేగగా, 34 పరుగులు జోడించి విజయంలో తనదైన పాత్ర పోషించాడు ధోని. జూన్ 9న తన తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమిండియా.
ఇది చదవండి: మిస్టర్ కూల్‌కు మద్దతుగా కూతురు జీవా జోష్