వన్డే ప్రపంచకప్- 2023 అర్హత పోటీల షెడ్యూల్‌ను బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. జూన్ 18 నుంచి జులై 9 వరకు జరగనున్న ఈ క్వాలిఫైయర్స్‌ను జింబాబ్వేలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
2023లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను భారత్ వేదికగా నిర్వహించనున్నారు. అయితే కరోనా కారణంగా ఈ టోర్నీని అదే ఏడాది అక్టోబరు-నవంబరుకు రీషెడ్యూల్ చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-7 స్థానాల్లో ఉన్న జట్లు టోర్నీకి సరాసరి అర్హత సాధిస్తాయి. క్వాలిఫైయర్స్‌లో విజేతగా నిలిచిన టీమ్ 8వ జట్టుగా టోర్నీలో చేరుతుంది.
దీంతో పాటు ప్రపంచ క్రికెట్ లీగ్ 2, ఛాలెంజ్ లీగ్ షెడ్యూల్‌నూ ఐసీసీ ప్రకటించింది. ఈ లీగును వచ్చే ఏడాది మార్చి 19 నుంచి యూఎస్ఏ, నేపాల్ వేదికగా నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: భారత్ x ఆస్ట్రేలియా: 'గులాబి' ఏం మాయ చేస్తుందో?