భారత్‌తో సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కుడిచేతి మణికట్టుకు గాయం కావడం వల్ల ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలే తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
ఫిబ్రవరి 3న.. 23వ పుట్టినరోజు జరుపుకున్న క్రాలే.. చెపాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో మార్బుల్స్‌పై జారి పడ్డాడు. దీంతో అతడి కుడి చేతి మణికట్టుకు గాయమైంది.
బుధవారం రాత్రి తీసిన స్కానింగ్‌లో జాక్ క్రాలే కుడి చేతి మణికట్టుకు గాయమైనట్లు తేలింది. దీంతో భారత్‌తో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడు. రాబోయే కొన్ని వారాలు మా వైద్య బృందం అతడి పరిస్థితిని పరిశీలిస్తుంది.
-ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.
ఇప్పటివరకు పది టెస్టు మ్యాచ్‌లాడిన క్రాలే.. 616 పరుగులు చేశాడు. అందులో ఓ శతకంతో పాటు మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. గత శ్రీలంక పర్యటనలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా కోహ్లీ భవితపై హుస్సేన్ జోస్యం