ఈ లాక్డౌన్ కాలంలో దొరికిన విరామంతో క్రికెటర్లు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా టీమ్ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌లు ఒకరిపై ఒకరు ఫన్నీ పోస్టులు పెడుతూ.. చేసే కామెంట్లు అభిమానులకు భలే సరదాని తెప్పిస్తున్నాయి. తాజాగా, లెగ్ స్పిన్నర్ చాహల్.. రోహిత్ శర్మతో కలిసి తీసుకున్న ఒకప్పటి ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ క్రమంలోనే "నాకు సూపర్ హీరో అవసరం లేదు. నా పెద్ద అన్నయ్య ఉన్నాడు" అంటూ రాసుకొచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
గతంలో రోహిత్ శర్మ ఫొటోను అమ్మాయిగా మార్ఫ్ చేసి పోస్ట్ చేశాడు చాహల్. దీనిపై స్పందించిన రోహిత్.. చాహల్ వదులుగా ఉన్న టీషర్ట్ వేసుకున్న ఫొటోను షేర్ చేసి చమత్కరించాడు. వీరిద్దరూ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో కనిపించాల్సింది. అయితే, కరోనా కారణంగా లీగ్‌ను నిరవధిక వాయిదా వేశారు నిర్వాహకులు.