టీమ్‌ఇండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ సోషల్‌మీడియాలో మళ్లీ తన జోరు చూపించాడు. యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను కవ్వించాడు. అతడికి సంబంధిన ఓ పాత వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్‌వెబ్ నేతృత్వంలో పంత్ బాక్సింగ్ చేస్తున్న పాత వీడియోను యూజీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు చాహల్. అందులో పంత్ పంచ్‌లు విసురుతుంటే.. తానే శిక్షణ ఇస్తున్న రేంజ్‌లో ఈ మణికట్టు మాంత్రికుడు అతడిని అనుకరించాడు. ఆ వీడియోకు 'పంత్ భయ్యా! ఎందుకలా అలసిపోతున్నావ్.. ఇది నా శిక్షణ' అంటూ వ్యాఖ్య జోడించాడు. దీనికి స్పందించిన పంత్ నవ్వుతున్న ఎమోజీలను కామెంట్లుగా పెట్టాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు హర్షల్ పటేల్ 'యథా రాజా తథా ప్రజా' అన్న అర్థం వచ్చేలా హిందీలో కామెంట్ పెట్టాడు. 'యూజీ.. నువ్వో గొప్ప ఎంటర్‌టైనర్‌వి', 'నువ్వెందుకు ఇంత సరదాగా ఉంటావ్ యూజీ' అంటూ అభిమానులు కూడా కామెంట్లను పెడుతున్నారు.
ఇది చూడండి : ఫిక్సింగ్ కలకలం : క్రికెటర్లను విచారిస్తున్న పోలీసులు