ETV Bharat / sports

తండ్రి వ్యాఖ్యలను ఖండించిన యువరాజ్ - యువరాజ్ పుట్టినరోజు

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. అయితే ఈసారి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు యూవీ. అందుకు బదులు కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించాడు. అలాగే రైతుల ఆందోళనల పట్ల తన తండ్రి యోగ్​రాజ్ చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

Yuvraj Singh wished not to celebrate his birthday today because of farmers issue
తండ్రి వ్యాఖ్యలను ఖండించిన యువరాజ్ సింగ్
author img

By

Published : Dec 12, 2020, 12:37 PM IST

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ శనివారం 39వ జన్మదినం జరుపుకొంటున్నాడు. అయితే, ఈసారి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. తాజాగా ట్విట్టర్​లో ఓ పోస్టు పెట్టిన అతడు రైతుల ఆందోళనలపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తమ కోరికలు నెరవేరడానికి పుట్టిన రోజులు అవకాశాల లాంటివని, కానీ ఈసారి తాను వేడుకలు జరుపుకోవడం లేదని స్పష్టం చేశాడు. అందుకు బదులు.. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. దేశానికి రైతులే జీవనాధారం అని, శాంతియుతంగా చర్చిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని యూవీ రాసుకొచ్చాడు.

అలాగే రైతుల ఆందోళన పట్ల తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై యూవీ స్పందించాడు. సోమవారం అతడి తండ్రి యోగ్‌రాజ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను అర్థం చేసుకోవాలని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరాడు. అలాగే ఈ ఉద్యమానికి సంఘీభావంగా పలువురు క్రీడాకారులు తమకు ప్రభుత్వం బహూకరించిన క్రీడా పతకాలను తిరిగిచ్చేయడం సరైందేనని, అందుకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై యూవీ స్పందించాడు. ఒక భారతీయుడిగా తన తండ్రి చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు. అవి ఆయన‌ వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

ఇవీ చూడండి.. బర్త్​డే స్పెషల్​: యూవీ ఎక్కడుంటే అక్కడ సందడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.