టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నాడు. అందులో స్కేట్ బోర్డును పట్టుకుని నిలబడ్డాడు. అది చూసిన యువరాజ్ సింగ్.. భజ్జీని ఓ సరదా కోరిక కోరాడు. "పాజీ కొంచెం స్కేటింగ్ చేసి చూపియ్" అని అడిగాడు. అందుకు స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ అంతే సరదాగా జవాబిచ్చాడు. "ఇద్దరం కలిసి చేద్దాం" అని రిప్లై ఇచ్చాడు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
టీమ్‌ఇండియాలో హర్భజన్, యువీ ఎంతో సరదాగా ఉంటారు. మైదానంలో ఎంత చలాకీగా ఉంటారో సామాజిక మాధ్యమాల్లోనూ అలాగే ఉంటారు. తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ గతవారం ఫేస్ స్వాప్ ద్వారా టీమ్‌ఇండియా క్రికెటర్ల ఆడరూపాలు పంచుకున్నారు. యువీ తొలుత ప్రస్తుత క్రికెటర్ల ఆడ ముఖాల ఫొటోలు పంచుకోగా, తర్వాత భజ్జీ తన సహచరుల ఫొటోలు పంచుకున్నాడు. అవి కూడా నెటిజన్లను ఎంతో ఆకట్టుకున్నాయి.