ETV Bharat / sports

వివాదాస్పద వ్యాఖ్యలపై యువరాజ్ క్షమాపణ - యువరాజ్ క్షమాపణ

ఓ సామాజిక వర్గం గురించి తప్పుగా మాట్లాడినందుకు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన యువీ బహిరంగ క్షమాపణ చెప్పాడు.

యువరాజ్
యువరాజ్
author img

By

Published : Jun 5, 2020, 3:06 PM IST

టీమ్​ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​పై మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. చాహల్​ ఇటీవలే తన తండ్రితో కలిసి చేసిన టిక్​టాక్​ వీడియో గురించి యువీ స్పందించిన తీరుపై నెట్టింట విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సామాజిక కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సన్. తాజాగా ఈ విషయంపై క్షమాపణలు చెప్పాడు యువీ.

"ఈ విషయంపై నేను క్లారిటీ ఇస్తున్నా. నేనెప్పుడూ కులం, రంగు, లింగ బేధాల గురించి మాట్లాడను. నా జీవితం మొత్తం ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగిస్తా. అలాగే ప్రతి ఒక్కరిని ఎటువంటి తారతమ్యాలు లేకుండా గౌరవిస్తా. అయితే నా స్నేహితులతో మాట్లాడే సమయంలో అనుకోకుండా తప్పుగా మాట్లాడవచ్చు. కానీ ఒకరి ఫీలింగ్స్​ని దెబ్బతీయడం మాత్రం నా ఉద్దేశ్యం కాదు. ఆ మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే క్షమాపణలు కోరుతున్నా."

-యువరాజ్ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

రోహిత్ శర్మతో ఇన్​స్టా లైవ్​లో మాట్లాడుతున్నపుడు యువరాజ్​.. చాహల్​ను ఉద్దేశిస్తూ తన సామాజిక వర్గం గురించి మాట్లాడాడు. ఈ వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా దానిపై దుమారం రేగింది. యువీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.