టీమ్ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్.. నేడు(జులై 23) 30వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు చెప్పాడు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. 'మిస్టర్ చుహా' అని సంభోదిస్తూ.. ఈ ఏడాది కూడా కెరీర్ విజయవంతంగా కొనసాగించడం సహా కొంచెం బరువు పెరగాలని చమత్కరించాడు యువీ.
-
Yuzi Chahal or should I call you Mr. Chuha 🐁 😂 special wishes for you to gain some weight 💪🏻 keep entertaining with your funny videos & comments! Wishing you a successful year ahead, Happy Birthday 🎂 @yuzi_chahal #HappyBirthdayChahal pic.twitter.com/tK6lpjq0jf
— Yuvraj Singh (@YUVSTRONG12) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yuzi Chahal or should I call you Mr. Chuha 🐁 😂 special wishes for you to gain some weight 💪🏻 keep entertaining with your funny videos & comments! Wishing you a successful year ahead, Happy Birthday 🎂 @yuzi_chahal #HappyBirthdayChahal pic.twitter.com/tK6lpjq0jf
— Yuvraj Singh (@YUVSTRONG12) July 23, 2020Yuzi Chahal or should I call you Mr. Chuha 🐁 😂 special wishes for you to gain some weight 💪🏻 keep entertaining with your funny videos & comments! Wishing you a successful year ahead, Happy Birthday 🎂 @yuzi_chahal #HappyBirthdayChahal pic.twitter.com/tK6lpjq0jf
— Yuvraj Singh (@YUVSTRONG12) July 23, 2020
"చాహల్ లేదా నిన్ను మిస్టర్ చుహా అని పిలవొచ్చా? నీ ఫన్నీ వీడియోలు, మాటలతో మాకు వినోదాన్ని పంచుతూ, కెరీర్‌నూ విజయవంతంగా కొనసాగించాలని భావిస్తున్నాను. నువ్వు కొంచెం బరువు కూడా పెరగాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు యజువేంద్ర చాహల్"
-యువరాజ్ సింగ్, టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్
టీమ్ఇండియా యువ స్పిన్నర్ చాహల్.. ఎన్నో సరికొత్త రికార్డులను నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా ఘనత సాధించాడు. అదే ఫార్మాట్లో 50 వికెట్ల మార్క్‌ను వేగంగా అందుకున్న టీమ్ఇండియా తొలి స్పిన్నర్‌గానూ గుర్తింపు తెచుకున్నాడు.
2016లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన చాహల్.. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరఫున కీలక బౌలర్‌గా రాణిస్తున్నాడు.