ETV Bharat / sports

యువరాజ్​కు 'బాహుబలి' స్వాగతం - యువరాజ్​కు 'బాహుబలి' స్వాగతం

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్​కు 'బాహుబలి' లాంటి ఘనస్వాగతం పలికారు హోటల్ సిబ్బంది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేశాడు యూవీ.

Yuvraj Singh
యువరాజ్​కు 'బాహుబలి' స్వాగతం
author img

By

Published : Mar 22, 2021, 11:01 AM IST

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌కు 'బాహుబలి'లాంటి ఘన స్వాగతం లభించింది. గతరాత్రి శ్రీలంకతో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యూవీ (60; 41 బంతుల్లో), యూసుఫ్‌ పఠాన్‌ (62 నాటౌట్‌ ) చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలోనే హోటల్‌ సిబ్బంది యూవీకి వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. అతడు హోటల్‌లోకి ప్రవేశిస్తుండగా సిబ్బంది రెండు వైపులా నిల్చొని వంట సామగ్రి అయిన గరిటెలను పైకెత్తి స్వాగతం పలుకుతున్నట్లు పోజిచ్చారు. దానికి హిందీ 'బాహుబలి' పాటను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సెట్‌చేశారు. యువీ కూడా ఆనందంతో స్టెప్పులేసుకుంటూ లోపలికి వెళ్లాడు. ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని 'బ్రోకెన్‌ బాహుబలి' అని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సెహ్వాగ్‌(10), బద్రీనాథ్‌(7) విఫలమైనా సచిన్‌(30; 23 బంతుల్లో), యువరాజ్‌(60), యూసుఫ్‌(62*) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా యూవీ, యూసుఫ్‌ సిక్సుల మోత మోగించారు. ఆపై లంక బ్యాటింగ్‌లో సనత్‌ జయసూర్య(43; 35 బంతుల్లో), జయసింగె(40; 30 బంతుల్లో), వీరరత్నె(38; 15 బంతుల్లో 3x4, 3x6) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ జట్టు 167/7 స్కోర్‌తో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. గోనీ, మునాఫ్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.