వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా... నేటి నుంచి తొలి టెస్టులో బరిలోకి దిగుతోంది. అయితే మ్యాచ్‌కు ముందుకు కాస్త విరామం దొరకడం వల్ల జాలీ బీచ్‌లో జాలీగా గడిపింది కోహ్లీ సేన. ఈ సందర్భంగా కోహ్లీ, బుమ్రాలు తీసుకున్న సిక్స్‌ప్యాక్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరి ఫిట్‌నెస్‌పై తాజాగా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. "ఓహ్.. ఫిట్‌నెస్ ఐడల్" అంటూ కామెంట్ చేశాడు.
కొన్నేళ్లుగా కోహ్లీ ఫిట్‌నెస్ కోసం ఆహార నియంత్రణ పాటిస్తున్నాడు. తను మైదానంలో సులభంగా కదలడానికి, చురుకుగా ఉండటానికి వ్యాయామమే కారణమని చాలా సార్లు చెప్పాడు టీమిండియా కెప్టెన్.
ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకుంది టీమిండియా. నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్ కోసం కరీబియన్లతో తలపడనుంది కోహ్లీసేన. ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో సాయంత్రం 7గంటలకు తొలి టెస్టు ప్రారంభం కానుంది.