టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాకిస్థాన్ యువ క్రికెటర్ బాబర్ అజమ్‌ను పోల్చొద్దని అన్నాడు యూనిస్ ఖాన్. ఇటీవలే పాక్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని, అయితే బాబర్ అతడిలా రికార్డులు సాధించేందుకు మరో ఐదేళ్లు సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు.
"నాకు ఈ పోలికలు నచ్చవు. ప్రస్తుతం కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే బాబార్ అజమ్.. ఈ మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తున్నాడు. మరో ఐదేళ్ల విరాట్ స్థాయికి చేరుకుంటాడు. అయితే ఈ క్రమంలో అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వాలి. అప్పుడే మెరుగైన క్రికెటర్ అవుతాడు" -యూనిస్ ఖాన్, పాక్ బ్యాటింగ్ కోచ్
నా రికార్డులను అధిగమిస్తే చూడాలని ఉంది
బాబర్ ఎన్నో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పిన యూనిస్.. త్వరలో అతడు దిగ్గజ క్రికెటర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. తన రికార్డులను అధిగమిస్తే చూడాలని ఉందని అన్నాడు.
ఇవీ చదవండి: