బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా యువ బౌలర్ దీపక్ చాహర్.. పొట్టి ఫార్మాట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి ఆశ్చర్యపర్చాడు. హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకుని ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్ జరిగి మూడురోజులైనా కాకముందే మరో హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు.
![Young Bowler Deepak Chahar got 2nd hat-trick with in 3 days, this time in Syed Mushtaq Ali Trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dc_1211newsroom_1573564563_870.jpg)
ఈసారి దేశవాళీ..
అప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటితే.. తాజాగా జాతీయ టీ20 ముస్తాక్ అలీ టోర్నీలో ఈ గణాంకాలు నమోదు చేశాడు. తిరువనంతపురం వేదికగా మంగళవారం(నవంబర్ 12) రాజస్థాన్, విదర్భ జట్ల మధ్య దేశవాళీ టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో 3 ఓవర్లు వేసిన దీపక్ చాహర్.. కేవలం 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్, ఒక మెయిడెన్ ఓవర్ ఉంది. ఫలితంగా రాజస్థాన్.. ప్రత్యర్థి విదర్భను 13 ఓవర్లలో 99 పరుగులకే కట్టడి చేసింది. అయితే వీజేడీ పద్ధతి ప్రకారం 13 ఓవర్లలో 107 లక్ష్యం నిర్దేశించగా.. 105 రన్స్‌కే పరిమితమైంది రాజస్థాన్. ఫలితంగా చాహర్ హ్యాట్రిక్ తీసినా తన జట్టు ఓటమిపాలైంది.
బంగ్లాదేశ్‌తో ఆదివారం(నవంబర్ 10) జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు నమోదు చేశాడు భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్. బంగ్లా-భారత్ మధ్య జరిగిన రెండో టెస్టులో 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
చాహర్ 88 స్థానాలు పైకి..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత పేసర్ దీపక్ చాహర్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకబిగిన 88 స్థానాలు ఎగబాకాడు. తాజా ర్యాంకుల్లో అతడు 42వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్-10 బౌలర్లలో ఎనిమిది మంది స్పిన్నర్లే కావడం విశేషం. బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఏడో స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో అత్యుత్తమ స్థానం అతడిదే. టీమ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీసేన ఐదో స్థానంలో కొనసాగుతోంది.