ఆస్ట్రేలియా టీ20 లీగ్ 'బిగ్ బాష్'.. పలు మార్పులతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇన్నింగ్స్ పదో ఓవర్ తర్వాత బ్యాట్మన్ లేదా ఫీల్డర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకునే అవకాశం కల్పించారు. సంప్రదాయ క్రికెట్లో ప్రత్యామ్నాయ ఆటగాడికి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి అనుమతించరు. ఈ లీగ్‌లో మాత్రం ప్రత్యామ్నాయ ఆటగాళ్లను బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ (ఒక్క ఓవర్ మాత్రమే) వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు.
బ్యాటింగ్ పవర్‌ప్లే
పవర్‌ప్లే నియమాల్లోనూ మార్పు చేశారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోని ఆరు ఓవర్ల పవర్‌ప్లేను నాలుగు ఓవర్లకు కుదించారు. మిగిలిన రెండు ఓవర్ల పవర్ ప్లేను బ్యాటింగ్ జట్టు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఈ సమయంలో ఇద్దరు ఫీల్డర్లు మినహా మిగిలిన వారంతా ఇన్నర్ సర్కిల్లోనే ఉండాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బోనస్ పాయింట్
ఓ బోనస్ పాయింట్‌ను ఇవ్వడానికి నియమాలలో మూడో మార్పు చేశారు. దానికి 'బాష్ బూస్ట్' అని పేరు పెట్టారు. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సగం పూర్తయిన తర్వాత తొలి పది ఓవర్లలో రెండు జట్లలో ఎక్కువ స్కోరు చేసిన వారికి ఈ పాయింట్‌ను కేటాయిస్తారు.
ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి బిగ్‌బాష్ లీగ్ కొత్త సీజన్ నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.