ETV Bharat / sports

మొతేరాలో లైటింగ్​ వ్యవస్థపై కోహ్లీ ఆందోళన - players will need to adapt quickly:

మొతేరా స్టేడియంలో అమర్చిన లైటింగ్ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత కెప్టెన్ కోహ్లీ. ఫ్లడ్​లైట్లు కాకుండా స్టేడియం పైకప్పునకు లైట్లు అమర్చడం వల్ల బంతిని గుర్తించడానికి ఇబ్బంది అవుతుందని పేర్కొన్నాడు.

Worried about the lights, players will need to adapt quickly: Kohli
మొతేరాలో లైటింగ్​ వ్యవస్థపై కోహ్లీ ఆందోళన
author img

By

Published : Feb 24, 2021, 3:34 PM IST

Updated : Feb 24, 2021, 4:51 PM IST

మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న మొతేరా స్టేడియం​ లైటింగ్​ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశాడు భారత కెప్టెన్​ కోహ్లీ. ఎల్​ఈడీ లైట్ల వల్ల ఫీల్డింగ్​ జట్టుకు ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపాడు.

అహ్మదాబాద్​లో పునఃనిర్మించిన మొతేరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డు సృష్టించింది. కానీ, ఇతర స్టేడియాల తరహాలో ఫ్లడ్​లైట్లు కాకుండా మైదానం పైకప్పు చుట్టూ ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఇది చూడటానికి వలయాకారంలో ఉన్న మంటలాగే కనిపిస్తుంది. దీని వల్ల ఫీల్డింగ్​ చేసే జట్టుకు సమస్యలు ఎదురవుతాయని విరాట్​ ఆందోళన వ్యక్తం చేశాడు.

"ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతేరాను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. లైటింగ్​ వ్యవస్థను చూసి ఒకింత ఆందోళనకు గురయ్యాను. ఈ తరహా లైట్ల వల్ల బంతిని గుర్తించడం కష్టమవుతుంది. కానీ, ఆటగాళ్లు ఈ సమస్యను తొందరగా అధిగమించాలి. గతేడాది ఐపీఎల్​లో ఇలాంటి పరిస్థితి మాకు దుబాయ్​లోనూ ఎదురైంది."

-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.

దుబాయ్​ వేదికగా జరిగిన గత ఐపీఎల్​లో ఈ విధమైన లైటింగ్​ వ్యవస్థ వల్ల ఫీల్డర్లు పలు క్యాచ్​లు జారవిడిచారు.

ఇదీ చదవండి: పింక్​ టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​

Last Updated : Feb 24, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.