క్రికెట్.. భారతదేశంలో ఈ క్రీడకు ఉన్న ఆదరణే వేరు. చిన్న నుంచి పెద్ద వరకు వయసుతో పనిలేకుండా అభిమానించే ఆట ఇది. అందుకే ఇక్కడ జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రపంచంలో అత్యంత ధనవంతమైన లీగ్‌గా పేరు తెచ్చుకుంటే.. క్రికెట్ టోర్నీలు, వ్యవహారాలు చూసుకునే భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ప్రపంచంలోనే ధనవంతమైన బోర్డుగా ఖ్యాతి గడించింది. క్రికెట్ ఒక భావోద్వేగంగా చూసుకునే దేశంలో.. ఆటే కాకుండా వాటిని నిర్వహించే మైదానాలూ చరిత్రలో నిలిచిపోయాయి. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఎత్తైన స్టేడియాలు మనదేశంలోనే ఉండటం విశేషం. ఒకసారి వాటి విశేషాలు చూద్దామా..?
అత్యంత ఎత్తులో ఉన్న స్టేడియం..
ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న స్టేడియంగా పేరు తెచ్చుకుంది హిమాచల్‌ప్రదేశ్‌లోని చైల్ క్రికెట్ గ్రౌండ్. 1893లో దీన్ని చైల్ మిలిటరీ స్కూల్లో భాగంగా నిర్మించారు. ఇది సముద్రమట్టానికి 2,444 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే దాదాపు 8వేల 18 అడుగుల ఎత్తులో అన్నమాట.
భుపేందర్ సింగ్ మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించే సమయంలో దీన్ని నిర్మించాడు. ఆ రాజు గొప్ప క్రికెట్ ప్రేమికుడని చరిత్ర చెబుతోంది. చైల్ మిలిటరీ స్కూలుకు ఆటస్థలం అవసరమని దీన్ని నిర్మించారు. స్కూళ్లకు సెలవులు ఉన్నప్పుడు ఈ మైదానంలో పోలో (గుర్రాల సాయంతో ఆడే ఓ ఆట), బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ క్రీడలు ఆడేవారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అతిపెద్ద స్టేడియం 'మోటేరా'...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియం(మోటేరా స్టేడియం) త్వరలో అరుదైన ఘనత సాధించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా గుర్తింపు దక్కించుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న మెల్‌బోర్న్‌ను ఇది వెనక్కి నెట్టేయనుంది.
-
Inside view 👇👇👇👇#MoteraStadium #KemChhoTrump pic.twitter.com/xrHpL1I9Pb
— RAHUL (@SirKLRahul) February 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Inside view 👇👇👇👇#MoteraStadium #KemChhoTrump pic.twitter.com/xrHpL1I9Pb
— RAHUL (@SirKLRahul) February 18, 2020Inside view 👇👇👇👇#MoteraStadium #KemChhoTrump pic.twitter.com/xrHpL1I9Pb
— RAHUL (@SirKLRahul) February 18, 2020
>> మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఈ మైదానంలో 49వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
>> 1983లో ఈ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది.
>> మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ స్టేడియంలోనే టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
>> క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇదే మైదానంలో తన టెస్ట్ కెరీర్‌లో తొలి ద్విశతకాన్ని నమోదుచేశాడు.
- ట్రంప్ మాట్లాదేది ఇక్కడే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఈనెల 24, 25న భారత్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లో నిర్మించిన ఈ మోటేరా స్టేడియం వద్ద వేదిక ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. భారత ప్రధానమంత్రి మోదీ, ట్రంప్ ప్రజలను ఉద్దేశించి ఇక్కడే మాట్లాడనున్నారు. తొలుత ట్రంప్ ఈ స్టేడియాన్ని ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
- ప్రధాని కలల స్టేడియం...
మోటేరా స్టేడియానికి 'సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం' అని పేరు మార్చారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్. ప్రధాని గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిని నిర్మించాలని సంకల్పించారు.
- విశేషాలు...నవీకరణ...
2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 3 ప్రవేశ ద్వారాలతో 63 ఏకరాల్లో ఈ స్టేడియం ఉంది. ఇందులో ఒలింపిక్ స్థాయి ఈత కొలను, నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, 75 కార్పొరేట్ బాక్స్‌లు ఉన్నాయి. ఇందులో ప్రధాన ప్రత్యేకత ఎల్ఈడీ దీపాలు. సాధారణంగా స్టేడియంలో ఉండే ఫ్లడ్‌లైట్లు కాకుండా ఇక్కడ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
- ఖర్చు...
ఈ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ. 800 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఇందులో అత్యాధునిక డ్రెస్సింగ్ గదులు, ఫుడ్ కోర్ట్లు, ప్రతి స్టాండ్‌లోనూ ఆతిథ్య ప్రదేశాలు ఉన్నాయి. రెండు చిన్న క్రికెట్ ప్రాక్టీస్ మైదానాలు ఇక్కడ నెలకొన్నాయి.
ప్రధాన మైదానానికి బయట ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయంలో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్రికెట్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్, టెన్సిస్ కోర్ట్లు, స్క్వేష్ అరెనా, టేబుల్ టెన్నిస్‌కు ప్రత్యేక ప్రదేశాలు, క్లబ్‌హౌస్ ఉన్నాయి.
- అతిపెద్ద పార్కింగ్...
3 వేల కార్లు, 10 వేల ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి.
- స్కైవాక్...
మోటేరా మెట్రో స్టేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా స్కైవాక్‌ను 2020 సెప్టెంబర్ తర్వాత పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే మెట్రో స్టేషన్ల నుంచి 300 మీటర్ల లోపే ప్రజలు ఇక్కడకు చేరుకోగలరు. రోడ్డు మార్గం ద్వారా వచ్చే అవసరం ఉండదు.
2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. 2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియంను నిర్మించారు. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్దదైన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం సామర్థ్యం లక్ష మాత్రమే. త్వరలో ఈ రికార్డును మోటేరా తిరగరాయనుంది.
దేశంలో తొలి, ప్రపంచంలో ఏడో పురాతనమైనది..
మెల్‌బోర్న్ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద రెండో మైదానంగా పేరు తెచ్చుకుంది ఈడెన్ గార్డెన్స్. మోటేరా ప్రారంభమైతే ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టేడియంగా పేరుతెచ్చుకోనుంది. దేశంలో రెండోస్థానంలో నిలవనుంది. అయితే ఇది దేశంలోనే అత్యంత పురాతన స్టేడియంగా, ప్రపంచంలో ఏడో స్థానంలో నిలిచింది. ఇందులో 80 వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించొచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
>> 2011లో స్టేడియం నవీకరించక ముందు దీని సీటింగ్ సామర్థ్యం లక్ష ఉండేది. దీన్ని 1841లో డిజైన్ చేసి 1864లో పూర్తి చేశారు. అప్పటి భారత గవర్నర్ జనరల్ ఆక్లాండ్ ఈడెన్.. అతడి సోదరి ఇమిలీ ఈడెన్ గుర్తుగా ఈడెన్ గార్డెన్స్‌గా నామకరణం చేశారు. అందుకే దీన్ని ఉపఖండంలో 'క్రికెట్ మక్కా' అని కొందరంటే బైబిల్‌లోని 'గార్డెన్ ఆఫ్ ఈడెన్' (స్వర్గం)గా మరికొందరు భావిస్తారు.
>> 1934లో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇక్కడ తొలి టెస్టు జరిగింది. 1987లో దాయాదులు భారత్, పాక్ తొలి వన్డేలో తలపడ్డాయి. 2011లో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 నిర్వహించారు. హీరోకప్ సెమీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా తొలి డే/నైట్ మ్యాచ్ ఆడాయి. అంతర్జాతీయ నిషేధం నుంచి బయటపడ్డాక సఫారీలు తొలి టెస్టు ఆడింది ఇక్కడే కావడం గమనార్హం. 2016లో ఒకే రోజు రెండు ప్రపంచకప్ ఫైనళ్లకు ఆతిథ్యమిచ్చి ఈడెన్ అరుదైన రికార్డు సాధించింది.
ఈడెన్ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో 15 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదికైంది. పురుషుల వన్డే 6, టీ20 5, మహిళల వన్డే ప్రపంచకప్ 2, టీ20 1 మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ 4 ప్రపంచకప్ ఫైనల్స్ నిర్వహించడం అరుదైన ఘనత. 1987 వన్డే, 2016 టీ20, 1997 మహిళల వన్డే, 2016 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనళ్లకు ఈడెన్ ఆతిథ్యమిచ్చింది.