IRCTC Golden Triangle Tour Package : దేశ రాజధాని దిల్లీకి వందేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మరి మీరు కూడా ఆ ప్రదేశాలను విజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మీకో శుభవార్త చెబుతోంది. దిల్లీలోని పలు ప్రదేశాలను చూసేందుకు ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
"గోల్డెన్ ట్రయాంగిల్" పేరుతో ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా జర్నీ ఉంటుంది. ప్రతీ బుధవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్లో భాగంగా దిల్లీ, జైపూర్, ఆగ్రాలోని పలు ప్రదేశాలు సందర్శించవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి జర్నీ(ట్రైన్ నెం. 12723) మొదలవుతుంది. ఆ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8 గంటలకు దిల్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యి ఫ్రెషప్ అయిన తర్వాత దిల్లీలోని కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, అక్షరధామ్ విజిట్ చేస్తారు. ఆ రాత్రి దిల్లీ హోటల్లో బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్, తీన్‌మూర్తి భవన్, ఇండియా గేట్‌ను సందర్శిస్తారు. ఆరోజు కూడా దిల్లీలోనే స్టే చేయాలి.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి జైపూర్‌కు బయలుదేరుతారు. అక్కడి చేరుకుని హోటల్లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత హవా మహల్ విజిట్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రికి జైపూర్‌లో బస చేయాలి.
- ఐదో రోజు అమీర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ సందర్శిస్తారు. ఆ రాత్రికి జైపూర్‌లో ఉంటారు.
- ఆరో రోజు ఉదయం చెక్ అవుట్ అయ్యి ఆగ్రాకు బయలుదేరుతారు. మార్గమధ్యలో ఫతేపూర్ సిక్రీ విజిట్ చేస్తారు. ఆగ్రాకు చేరుకుని అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఏడో రోజు తెల్లవారుజామున తాజ్‌మహల్ సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి ఆగ్రా ఫోర్ట్ సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఆగ్రా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెం. 12724) స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఎనిమిదో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరలు చూస్తే: 1 నుంచి 3 ప్రయాణికులు
- కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.58,340, డబుల్ షేరింగ్‌కు రూ.32,640, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.25,420 నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.18,440, విత్ అవుట్ బెడ్ అయితే రూ.17,320 చెల్లించాలి.
- స్టాండర్డ్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.55,290, డబుల్ షేరింగ్‌కు రూ.29,590, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.22,370 నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.15,390, విత్ అవుట్ బెడ్ అయితే రూ.14,260 చెల్లించాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ట్రైన్ టికెట్లు
- హోటల్ అకామిడేషన్
- 5 బ్రేక్‌ఫాస్ట్‌లు
- ప్యాకేజీని బట్టి సైట్ సీయింగ్ కోసం వెహికల్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 20వ తేదీన అందుబాటులో ఉంది. ఇతర తేదీల్లో కూడా ఉంది.
- టూర్ పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
కార్తికమాసం స్పెషల్ - శ్రీశైలం దర్శించుకునేందుకు IRCTC సూపర్ ప్యాకేజీ - పైగా యాదాద్రి వెళ్లొచ్చు!
కార్తికమాసం స్పెషల్ - అరుణాచలం TO తంజావూర్ - రూ.14వేలకే IRCTC సూపర్ ప్యాకేజీ!
హైదరాబాద్ To శ్రీలంక - రామాయణ ఇతిహాసాలు చూసేందుకు - IRCTC సూపర్ ప్యాకేజీ!