ETV Bharat / state

చిట్టితల్లికి ఎంత పెద్ద కష్టమొచ్చింది - వైద్యానికి రోజుకు రూ.2.50 లక్షలు

కాలేయ వ్యాధితో సతమతమవుతున్న చిన్నారి - వైద్యానికి రోజుకు లక్షల్లో ఖర్చు - ప్రజలు, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకోలు

A poor family waiting for help
A poor family waiting for help (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2024, 11:01 PM IST

A Poor Family Waiting for Help Over Daughter Treatment : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. రోజూ కూలీ నాలీ చేసుకోవడం ద్వారా వచ్చిన డబ్బులే వారికి జీవనాధారం. ఏదో ఉన్నంతలో బతుకు బండిని నెట్టుకొస్తున్న తమ కుటుంబంలో కుమార్తెకు వచ్చిన వ్యాధిని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాపకు లివర్​ ఇన్​ఫెక్షన్​ అయిందని వైద్యులు చెప్పడంతో, తెలిసిన వారి వద్ద అప్పు చేసి ఖర్చు పెట్టారు. వ్యాధి చికిత్సకు రోజుకు రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో అంత డబ్బు ఏవిధంగా సమకూర్చాలో తెలియక ఆశగా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన పూసల యోగేంద్రచారి, కీర్తన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మోహన సాయిప్రియ, చిన్న కుమార్తె వర్షిణి. కూలీ పనులు చేసుకుంటేనే ఆ పూట గడుస్తుంది. సాయిప్రియ(4)కు వారం క్రితం డెంగీ రావడంలో భూపాలపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో చికిత్స అందించినా నయం కాలేదు.

డాక్టర్లు లివర్‌ ఇన్‌ఫెక్షన్‌ అయిందని చెప్పడంతో తెలిసిన వారి వద్ద రూ.8 లక్షల వరకు అప్పులు తీసుకొని తల్లిదండ్రులు 3 రోజులుగా హైదరాబాద్‌ రెయిన్‌బో హాస్పిటల్​లో చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే రూ.3 లక్షల వరకు మందుల నిమిత్తం ఖర్చు చేశారు. రోజూ లివర్, కిడ్నీ డయాలసిస్‌ చేస్తున్నారు. బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి పాపకు ప్లాస్మా థెరపీని అందిస్తున్నారు. ఈ చికిత్సకు రోజుకు రూ.2.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పాప ఆరోగ్యం మెరుగుపడం వరకు ఈ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. పెద్ద మనసుతో దాతలు, రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బాధితుల ఫోన్‌ పే నంబరు 95055 96568.

పెళ్లైన 5 నెలలకే 2 కిడ్నీల్లో సమస్య - ఆపన్నహస్తం కోసం యువతి ఎదురుచూపులు - A poor family waiting for help

కూర్చోలేడు, నడవలేడు - వెన్నుపూస దెబ్బతిని జీవచ్ఛవంలా యువకుడు - దాతల సాయం కోసం ఎదురుచూపులు - Young Man Seeking Help

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.