ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం 'మోటేరా'. గతంలో ఉక్కుమనిషి 'సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్' పేరుతో ఉన్న మైదానం స్థానంలో దీన్ని నిర్మించారు. అందుకే ఈ స్టేడియానికి అదే పేరు పెట్టారు. అహ్మదాబాద్‌లో ఉన్న ఈ స్టేడియం సోమవారం 'నమస్తే ట్రంప్' సభకు దాదాపు లక్ష మందికి ఆతిథ్యమిచ్చింది. అయితే దాదాపు 4వేల కుర్చీలు తక్కువై ప్రపంచంలో అరుదైన ఘనతకు అడుగుదూరంలో ఆగిపోయిందీ స్టేడియం. ఈ నేపథ్యంలో భారత మైదానానికి పోటీనిచ్చే స్టేడియాలు ప్రపంచవ్యాప్తంగా ఏమేం ఉన్నాయో ఓ లుక్కేద్దాం!
-
Electric Atmosphere at Motera Stadium as people eagerly wait to welcome President @realDonaldTrump #NamasteTrump pic.twitter.com/9VyxlynZWU
— PMO India (@PMOIndia) February 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Electric Atmosphere at Motera Stadium as people eagerly wait to welcome President @realDonaldTrump #NamasteTrump pic.twitter.com/9VyxlynZWU
— PMO India (@PMOIndia) February 24, 2020Electric Atmosphere at Motera Stadium as people eagerly wait to welcome President @realDonaldTrump #NamasteTrump pic.twitter.com/9VyxlynZWU
— PMO India (@PMOIndia) February 24, 2020
రన్‌గ్రేడో మేడే
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఉత్తర కొరియాలోని ప్యాంగ్‌యాంగ్‌లో ఉంది. పేరు రన్‌గ్రేడో మేడే స్టేడియం. సామర్థ్యం 1,14,000. సియోల్‌లో 1988లో దక్షిణ కొరియా ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది. ఇందుకు పోటీగా ఉ.కొరియా 1989లో 'వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్' కోసం బిడ్డింగ్ వేసింది. అదే ఏడాది మే 1న దీనిని ఆరంభించింది. ప్రస్తుతం ఈ మైదానంలో వార్షిక అరిరంగ్ క్రీడలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద జిమ్నాస్టిక్స్ పోటీల నిర్వహించి గిన్నిస్ రికార్డులకెక్కింది.
ది బిగ్ హౌజ్
అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మైదానాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మిచిగన్‌లోని 'ది బిగ్ హౌజ్'. దాదాపు 1,09,318 మంది కూర్చోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్.. 1964లో ఇక్కడ 'గ్రేట్ సొసైటీ ప్రోగ్రామ్ను' నిర్వహించారు. 1927లో ఈ స్టేడియం నిర్మించినప్పుడు సీటింగ్ సామర్థ్యం 72,000 మాత్రమే. దఫదఫాలుగా ఆధునికీకరిస్తూ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచారు. 'మిచిగన్ యూనివర్సిటీ', 'నోట్రె డేమ్ ఫైటింగ్ ఐరిష్' ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 1,15,000 మంది హాజరవ్వడం ఇక్కడ రికార్డు.
బీవర్ స్టేడియం
ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టేడియం 'బీవర్'. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉంది. యూనివర్సిటీ మైదానం కావడం వల్ల ఎక్కువగా అంతర్ కళాశాలల పుట్‌బాల్ పోటీలు జరుగుతాయి. సీటింగ్ సామర్థ్యం 1,06,572. అయితే 2018, సెప్టెంబర్లో పెన్సిల్వేనియా, ఒహయో రాష్ట్రాల మధ్య జరిగిన పుట్‌బాల్ పోరును.. 1,10,889 మంది ప్రత్యక్షంగా వీక్షించడం ఓ పెద్ద రికార్డు. దాదాపు 14 సార్లు లక్ష మందికి పైగా అభిమానులు హాజరయ్యారు.
మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం
'మోటేరా' నిర్మించనంత వరకు ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం 'మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం'. ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. ఇందులో దాదాపు 1,00,024 మంది మ్యాచ్‌ని వీక్షించొచ్చు. 1992, 2015 వన్డే ప్రపంచకప్ ఫైనళ్లకు ఇదే వేదిక. ప్రపంచంలోని అత్యంత పురాతన స్టేడియాల్లో ఇదొకటి. 1853లో నిర్మించారు. ప్రధానంగా ఇక్కడ క్రికెట్ ఆడినా ఫుట్‌బాల్ మ్యాచులూ నిర్వహిస్తారు. క్రికెట్ కన్నా ఎక్కువగా ఫుట్‌బాల్ అభిమానులే ఇక్కడికి వస్తారు.
రోజ్ బౌల్
అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్మించిన రోజ్‌బౌల్ స్టేడియం ఎంతోమందికి ఇష్టం. దీని సీటింగ్ సామర్థ్యం 1,01,799. రెండుసార్లు ఒలింపిక్ ఫైనల్స్‌కు వేదిక. ఇక రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్స్, ఐదు సూపర్‌బౌల్స్ జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా జరిగే కళాశాలల ఫుట్‌బాల్ పోటీలకు ఈ మైదానం నిండిపోతుంది. జులై 4న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ పేల్చే బాణసంచా అమెరికాలోనే అద్భుతమని అంటారు.
సాకర్ సిటీ
దక్షిణాఫ్రికాలోని జోహన్స్‌బర్గ్‌లో ఉన్న సాకర్ సిటీ మైదానం చారిత్రక ఆనవాళ్లకు నెలవు. దాదాపు 94,807 మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించొచ్చు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెల్సన్ మండేలా తొలి ప్రసంగం చేసిందిక్కడే. 2013లో ఆయన కన్నుమూసిన తర్వాత స్మారక సభనూ ఇక్కడే నిర్వహించారు. మొదట ఈ మైదానం పేరు ఎఫ్‌ఎన్‌బి(ఫస్ట్ నేషనల్ బ్యాంక్). 2010 సాకర్ ప్రపంచకప్ సందర్భంగా 'సాకర్ సిటీ'గా మార్చారు. ప్రాయోజిత పేర్లు ఉండేందుకు ఫిఫా అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.