ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 మహిళా ప్రపంచకప్‌లో టీమిండియా సత్తాచాటుతోంది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన హర్మన్ సేన సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఘనత వహించింది. కానీ ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాయింట్లు ఎక్కువ ఉన్న కారణంగా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది భారత్. అయితే ఈ టోర్నీలో ఆద్యంతం భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ, స్పిన్నర్ రాధా యాదవ్. మొత్తంగా ఈ మెగాటోర్నీల్లో సత్తాచాటిన భారత మహిళా క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.
మహిళా టీ20 ప్రపంచకప్ -2020 (ఆస్ట్రేలియా)
ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఎక్కువగా వినపడుతోన్న యువ సంచలనం పేరు షెఫాలీ వర్మ. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుగాడికి దిగుతోన్న షెఫాలీ వేగంగా పరుగులు సాధిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో 29(15), 39 (17), 46 (34), 47 (34) పరుగులు చేసింది. ఈ టోర్నీలో 161 రన్స్‌తో అత్యధిక పరుగుల మహిళల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌కు చెందిన నటాలియా సీవర్ (202), హేదర్ నైట్ (193) ముందున్నారు. ఇంగ్లాండ్ సెమీస్‌లోనే వెనుదిరగడం వల్ల అత్యధిక పరుగులు సాధించేందుకు షెఫాలీకే ఎక్కువ అవకాశం ఉంది.
-
That sound off Shafali Verma's bat 💥
— T20 World Cup (@T20WorldCup) March 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch the new No.1 T20I batter do her thing at the nets before India's big #T20WorldCup semi-final.#INDvENG pic.twitter.com/rsugzYKFfj
">That sound off Shafali Verma's bat 💥
— T20 World Cup (@T20WorldCup) March 4, 2020
Watch the new No.1 T20I batter do her thing at the nets before India's big #T20WorldCup semi-final.#INDvENG pic.twitter.com/rsugzYKFfjThat sound off Shafali Verma's bat 💥
— T20 World Cup (@T20WorldCup) March 4, 2020
Watch the new No.1 T20I batter do her thing at the nets before India's big #T20WorldCup semi-final.#INDvENG pic.twitter.com/rsugzYKFfj
బౌలింగ్ విభాగంలో రాధా యాదవ్ సత్తాచాటుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 వికెట్లు సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 19 రన్స్ ఇచ్చి 4 వికెట్లు సాధించింది. ఈ ప్రదర్శన చాలా కాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. శిఖా పాండే కూడా మంచి ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు 7 వికెట్లు సాధించింది. ఈ ముగ్గురు ఫైనల్లోను ఇదే ప్రదర్శనను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మహిళా టీ20 ప్రపంచకప్ -2018 (వెస్టిండీస్)
2018 ఎడిషన్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన బ్యాట్‌తో రాణించారు. కెప్టెన్ హర్మన్ ఈ టోర్నీలో ఓ సెంచరీతో పాటు 45.75 సగటుతో మొత్తం 183 పరుగులు చేసింది. ఇక మంధాన 35.60 సగటుతో 178 రన్స్ చేసింది. వీరి బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియా సెమీస్‌కు చేరగలిగింది. అయితే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఈ మెగాటోర్నీలో హర్మన్, స్మృతి అత్యధిక పరుగులు సాధించిన వారిలో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మిథాలీ రాజ్ కూడా సత్తాచాటింది. 53.50 సగటుతో 107 పరుగులు సాధించింది. కౌర్, మంధానలతో పోలిస్తే ఇవి తక్కువే అయినప్పటికీ ప్రతిసారి జట్టు విజయంలో ఆ పరుగులు కీలకపాత్ర పోషించాయి. బౌలింగ్ విభాగంలో రాధా యాదవ్ 8 వికెట్లతో మెరిసింది.
మహిళా టీ20 ప్రపంచకప్ -2010 (వెస్టిండీస్)
2010 ఎడిషన్‌లోనూ టీమిండియా సెమీ ఫైనల్ చేరుకుంది. నెమ్మదైన పిచ్‌లపై కెప్టెన్ మిథాలీరాజ్ జట్టును ముందుండి నడిపించింది. మొత్తం 72.50 సగటుతో 145 పరగులు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో రెండో స్థానంలో నిలిచింది. బౌలింగ్ విభాగంలో ఆఫ్ స్పిన్నర్ డయానా డేవిడ్ 9 వికెట్లు సాధించింది. టోర్నీలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది.
మహిళా టీ20 ప్రపంచకప్ -2009 (ఇంగ్లాండ్)
టీ20 మహిళా ప్రపంచకప్ తొలి ఎడిషన్ ఇది. ఈ టోర్నీలోనూ సెమీ ఫైనల్ చేరుకుంది టీమిండియా. మిథాలీ రాజ్ 91 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచింది. లెగ్ స్పిన్నర్ ప్రియాంక రాయ్ 6 వికెట్లతో మెరిసింది.
-
🏏💥 India v Australia
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🎵🎤 Katy Perry
Be there to create history on Sunday as we aim to #FillTheMCG
Get your tickets now 🎟️👇 https://t.co/qHh1n3vmXP pic.twitter.com/jvtyeYZqoJ
">🏏💥 India v Australia
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020
🎵🎤 Katy Perry
Be there to create history on Sunday as we aim to #FillTheMCG
Get your tickets now 🎟️👇 https://t.co/qHh1n3vmXP pic.twitter.com/jvtyeYZqoJ🏏💥 India v Australia
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020
🎵🎤 Katy Perry
Be there to create history on Sunday as we aim to #FillTheMCG
Get your tickets now 🎟️👇 https://t.co/qHh1n3vmXP pic.twitter.com/jvtyeYZqoJ
ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచి తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది ఇండియా.