ETV Bharat / sports

మహిళలు మెరిసేనా..

author img

By

Published : Feb 5, 2019, 6:28 PM IST

వన్డే సిరీస్ గెలిచి సంతోషంగా ఉన్న భారత మహిళా జట్టు..టీట్వంటీ సిరీస్​లోనూ అదే ఊపు కొనసాగించాలనుకుంటోంది.

భారత మహిళల జట్టు

చివరి వన్డే​లో ఓడినా న్యూజిలాండ్​పై సిరీస్ గెలుచుకుంది మహిళల టీమిండియా జట్టు. అదే ఓటమి టీట్వంటీల్లో పునరావృతం కాకుడదని చూస్తుంది. రేపటి నుంచి మొదలు కాబోయే టీట్వంటీ సిరీస్​ను ఎలాగైనా చేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

మూడు వన్డేల సిరీస్​ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఫిబ్రవరి 1న జరిగిన చివరి వన్డేలో బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే ఆలౌటై.. మ్యాచ్​ను చేజార్చుకుంది.

హర్మన్​ప్రీత్ కౌర్, వన్డేల్లో చోటు దక్కించుకోలేక పోయింది. ప్రస్తుతం జరగబోయే టీట్వంటీలకు నేతృత్వం వహించనుంది.

భారత మహిళల జట్టు
వుమెన్ ఇండియా క్రికెట్ టీం
undefined

ఇంగ్లాండ్​లో జరిగిన ప్రపంచ టీట్వంటీ కప్​ సెమీస్​లో భారత్ పరాజయం తర్వాత ఆడుతున్న టీట్వంటీ మ్యాచ్ ఇదే. అప్పుడు కోచ్ రమేశ్ పొవార్ విషయంలో గొడవ జరగడం, ఆ తర్వాత కొత్త కోచ్​గా డబ్యూ.వి.రామన్ నియమితులవ్వడం జరిగింది.

పొట్టి ఫార్మాట్​లో మిథాలీ స్ట్రైక్ రేట్ ఏమంత గొప్పగా లేదు. మూడో వన్డేలో కూడా స్పిన్నర్ల బౌలింగ్​ను ఎదుర్కొలేక పోయింది. ఆ విషయంలో కొంచెం మెరుగు పరుచుకోవాలి.

మిథాలీ రాజ్
మిథాలీ రాజ్
undefined

ఓపెనింగ్ విషయంలో స్మృతి మంధనా, జెమియా రోడ్రిగ్జ్ జోడి ఆకట్టుకుంటోంది. వేద కృష్ణమూర్తి స్థానాన్ని ఆల్​రౌండర్ ప్రియా పూనియా భర్తీ చేయనుంది.

స్మృతి మంధాన
స్మృతి మంధాన
undefined

వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాలో జరగబోయే టీట్వంటీ ప్రపంచకప్​ ముందు జరిగే ఈ సిరీస్ టీం మేనేజ్​మెంట్ ధృడపరిచేందుకు సహాయపడుతుంది.

భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు..

భారత్: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధనా, మిథాలీ రాజ్, జెమియా రోడ్రిగ్జ్, దీప్తి శర్మ, తానియా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, అంజు పాటిల్, ఏక్తా బిస్త్, దయలన్ హేమలత, మన్షి జోషి, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, ప్రియా పూనియా.

న్యూజిలాండ్: అమీ సేటర్త్​వైట్(కెప్టెన్),సూజీ బేట్స్, బెర్నెండేన్ బెజుడెన్​హట్, సోఫి డివైన్, హేలి జెన్సన్, కైల్టిన్ గుర్రే, లీ కాస్పెరక్, అమిలియా కెర్, ప్రాన్సిన్ మేకె,కేతి మార్టిన్, రోజ్​మేరి మేయర్, హన్నా రో, ల్యీ తాహుహు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.