ETV Bharat / sports

'కోల్​కతా ప్రజల కోసమైనా ఐపీఎల్ గెలుస్తాం'

ఐపీఎల్​లో తమకు అండగా ఉన్న కోల్​కతా ప్రజల కోసమైనా ఈసారి లీగ్​లో విజేతగా​ నిలుస్తామని అన్నాడు కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​ దినేశ్​ కార్తీక్​. కరోనాతో పాటు అంపన్​ తుపాను వల్ల పశ్చిమ బంగా అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Winning IPL least we could for Kolkata: Dinesh Karthik
'కోల్​కతా కోసం కనీసం అదైనా చేస్తాం'
author img

By

Published : Jun 12, 2020, 5:37 AM IST

ఐపీఎల్​లో తమకు అండగా నిలిచిన కోల్​కతా ప్రజల కోసమైనా ఈసారి లీగ్​లో విజేతగా అవతరిస్తామని​ అభిప్రాయపడ్డాడు కోల్​కతా నైట్​రైడర్స్ కెప్టెన్ దినేశ్​ కార్తీక్​. రెండుసార్లు ఐపీఎల్​ ఛాంపియన్​గా నిలిచినందుకు కేకేఆర్​ అభిమానులు గర్వపడుతున్నారని తెలిపాడు. ఆ జట్టు అభిమానులతో ఆటగాళ్లు మానసికంగా ఎంతో దగ్గరయ్యారని వెల్లడించాడు.

"మేము కోల్​కతా అభిమానులతో మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఆ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. రెండు నెలలుగా కోల్​కతా విపత్తులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో వారి కోసం కనీసం ఐపీఎల్​ కప్​ను అయినా గెలుస్తాం. అయితే లీగ్ ఎప్పుడు జరుగుతుందనే దానిపై మాకూ ఇంకా స్పష్టత రాలేదు".

-దినేశ్​ కార్తీక్​, కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​

దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో అంపన్​ తుపానుతో పశ్చిమ బంగా అతలాకుతలమైంది. ఈ విపత్తు వల్ల ఎంతోమంది ప్రజలు తమ జీవితాలను, నివాసాన్ని కోల్పోయారు.

కరోనా లాక్​డౌన్​ కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్​ను.. ఈ ఏడాదిలో కచ్చితంగా నిర్వహిస్తామని తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ క్రమంలో మ్యాచ్​లు జరిపేందుకు రాష్ట్ర క్రికెట్ బోర్డులు సిద్ధంగా ఉండాలని కోరారు. త్వరలోనే టోర్నీపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఇదీ చూడండి... 'ఆలస్యం చేస్తే ఎవ్వరికీ ఉపయోగం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.