ETV Bharat / sports

ధోనీతో పాటు నెం.7 జెర్సీ రిటైర్​ కానుందా? - ధోనీ జెర్సీ రిటైర్​

అంతర్జాతీయ క్రికెట్​కు టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ ​వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. అతడి నెం.7 జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్​ ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు సీనియర్​ క్రికెటర్​ దినేశ్​ కార్తిక్​. ఈ వ్యాఖ్యలను బీసీసీఐ సభ్యురాలు శాంత రంగస్వామి సమర్థించారు.

dinesh
దినేశ్​కార్తిక్​
author img

By

Published : Aug 16, 2020, 3:02 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో మహీ ధరించిన నెం.7 జెర్సీకి.. బీసీసీఐ రిటైర్మెంట్​ పలుకుతుందా? లేదా ఆ నంబరును మరొకరికి కేటాయిస్తుందా? అనేది భారీ సంఖ్యలో నెటిజన్ల మదిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే తాజాగా ఈ ప్రశ్నను మొదటగా టీమ్​ఇండియా సీనియర్​ క్రికెటర్​ దినేశ్​ కార్తిక్ లేవనెత్తాడు. ఈ నెంబరుకు బోర్డు రిటైర్మెంట్​ ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు. ​

  • This is the last photo taken after our semis at the World Cup.lots of great memories through this journey. I hope the @bcci retire the #7 jersey in white ball cricket ❤️

    Good luck with your second innings in life , I’m sure you’ll have a lot of surprises for us there too 🙂💖 pic.twitter.com/4kX4uPhPOO

    — DK (@DineshKarthik) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతేడాది న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్​ సెమీఫైనల్​లో తనతో కలిసి మహీ దిగిన ఫొటోను పోస్ట్​ చేశాడు కార్తిక్​. "ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా ఇద్దరి మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. తెల్లబంతి క్రికెట్​లో బీసీసీఐ నెం.7 జెర్సీని రిటైర్మెంట్​ ప్రకటిస్తుందని భావిస్తున్నా. జీవితంలో ధోనీకి రెండో ఇన్నింగ్స్​ సాఫీగా సాగాలని కోరుకుంటున్నా. మరిన్ని అద్భుతాలు చూస్తావని అనుకుంటున్నా" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు.

2004లో అరంగేట్రం చేసిన కార్తిక్​.. ఇప్పటివరకు తన కెరీర్​లో 26 టెస్టులు, 94 వన్డేలు, 32టీ20లు ఆడాడు.

రిటైర్​ ఇవ్వడమే సమర్ధం

మహీ నెం.7 జెర్సీ రిటైర్మెంట్​పై బీసీసీఐ సభ్యురాలు, మాజీ టీమ్​ఇండియా మహిళా జట్టు సారథి శాంత రంగస్వామి స్పందిస్తూ.. ధోనీ తన కెరీర్​లో ఓ క్రికెటర్​గా, సారథిగా క్రికెట్​కు ఎంతో సహకారం అందించాడని కొనియాడారు. అతడికి నెం.7 జెర్సీని అంకితమివ్వడం సరైనదని సమర్థించారు.

2017లో అభిమానుల విజ్ఞప్తి మేరకు సచిన్​ ధరించిన నెం.10 జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్​ ప్రకటించింది.

ఇది చూడండి జేబు దొంగతో పోల్చుతూ ధోనీపై ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.