ఈ ఏడాది అక్టోబరు నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే టీమిండియా సారథి విరాట్ కోహ్లీని కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైన్, పేసర్ మైకెల్ స్టార్క్. తాజాగా వీరిద్దరూ కోహ్లీపై ఓ చర్చ జరిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రేక్షకులు లేకుండానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రేక్షకుల కేరింతలు లేకుంటే కోహ్లీ మునపటి లాగా ఆడగలడా? అంటూ చర్చించుకున్నారు.
"విరాట్ కోహ్లీ ఖాళీ స్టేడియంలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో..? అని ఆసక్తిగా ఉంది. అయినా ఎలాంటి పరిస్థితులకు అయినా విరాట్ కోహ్లీ వేగంగా అలవాటు పడుతుంటాడు. ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటం భిన్నమైన అనుభూతి. ఇక భారత్ జట్టుతో మ్యాచ్‌లంటే అది మరో యాషెస్ సిరీస్‌తో సమానం. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా ఒక పవర్‌హౌస్. వారితో పోటీపడితే ఆ మజానే వేరుగా ఉంటుంది" అని లైన్ వెల్లడించాడు.
ఇదీ చూడండి : యువరాజ్ ఫౌండేషన్‌కు అఫ్రిది భారీ విరాళం