వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు వెస్టిండీస్ షాకిచ్చింది. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 15 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు కరీబియన్ బ్యాట్స్‌మెన్. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్(67) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాట్స్‌మెన్ తలో చేయి వేసి జట్టుకు విజయాన్నందించారు. భారత బౌలర్లలో జడేజా, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో విండీస్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు సిమ్మన్స్, లూయిస్(40) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. లూయిస్‌ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్మైర్(23) బౌలర్లపై ప్రతి దాడికి దిగాడు. జడ్డూ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి భారత అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించాడు.
-
West Indies take it to a decider 💪
— ICC (@ICC) December 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Lendl Simmons played the key role with the bat, smashing 67* off 45 balls. He just loves playing India in must-win games!#INDvWI 👇 https://t.co/my4qd2mVoZ pic.twitter.com/GWcPxDftXj
">West Indies take it to a decider 💪
— ICC (@ICC) December 8, 2019
Lendl Simmons played the key role with the bat, smashing 67* off 45 balls. He just loves playing India in must-win games!#INDvWI 👇 https://t.co/my4qd2mVoZ pic.twitter.com/GWcPxDftXjWest Indies take it to a decider 💪
— ICC (@ICC) December 8, 2019
Lendl Simmons played the key role with the bat, smashing 67* off 45 balls. He just loves playing India in must-win games!#INDvWI 👇 https://t.co/my4qd2mVoZ pic.twitter.com/GWcPxDftXj
కోహ్లీ కిర్రాక్ క్యాచ్..
తర్వాత బంతిని కూడా లాంగాన్ దిశగా హిట్మైర్ భారీ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్లో విరాట్ కోహ్లీ అద్భత క్యాచ్‌తో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. హిట్మైర్ ఔటైనప్పటికీ నికోలస్ పూరన్(38) - సిమ్మన్స్ జోడీ దూకుడు తగ్గించలేదు. ఓవర్‌కు సిక్సర్, ఫోర్ చొప్పున మ్యాచ్‌ను ముందుగానే ముగించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో.. యువ బ్యాట్స్‌మన్ శివమ్ దూబే(54) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రిషభ్ పంత్(33) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో విలియమ్స్, హేడెన్ వాల్ష్ చెరో 2 వికెట్లతో రాణించగా.. పియర్రే, జేసన్ హోల్డర్, కాట్రెల్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: దంచి కొట్టిన దూబే.. భారత్ స్కోరు 170/7